Home /News /telangana /

EETALA RAJENDER HOUSE ARREST NOT TO GO JANAGAMA TO VISIT BJP ACTIVIST

Eetala House arrest : ఈటల హౌజ్ అరెస్ట్.. హోంమంత్రే.. ప్రధాని దిష్టిబొమ్మ తగులపెడతారా...?

eetala

eetala

Eetala House arrest : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జనగామలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఈటల వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈటల పోలీసులపై మండిపడ్డారు.

  పార్లమెంట్‌లో ప్రధాని మోదీ తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ పార్టీ ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను తగలపెట్టడడంతో పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే జనగామలో టీఆర్ఎస్ ,బీజేపీ నేతల మధ్య పోటాపోటి నినాదాలు చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి దాడులు చేసుకున్నారు. కాగా ఈ దాడిలో బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారని వారిని పరామర్శించేందుకు ఈటల బయలు దేరాడు. కాని ఈటల వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేసి బంధించారు.

  దీంతో ఈటల పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి.. కానీ ధర్నాలు చేయడానికి, నిరసనలు చెప్పడానికి టిఆర్ఎస్ పార్టీ వారికి మాత్రమే అనుమతులు ఉంటాయా? అంటూ పోలీసులను ప్రశ్నించారు.. దాడులు జరిగితే పోలీసులు వారి పక్షాన నిలుస్తారా అంటూ నిలదీశారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తుంటే.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే కనీసం గాయపడిన వారికి ధైర్యం చెప్పే స్వేచ్ఛ కూడా లేదా అంటూ ప్రశ్నించారు..

  Crime story : కిల్లర్ కిలేడి... ప్రియుడి కోసం, మొత్తం 5గురిని ఖతం చేసింది.. ఎలా అంటే..

  టీచర్ల ధర్నా చేస్తే వాళ్ళని గొడ్డులు బాదినట్టు బాదారు.. తెరాసా వాళ్లకేమో పోలీసులు బందోబస్తు ఇచ్చారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ? ఒక్క తెరాసాకేనా.. ప్రజాసంఘాలు, ఇతర పార్టీలకు మాట్లాడే అధికారం, నిరసన చెప్పే అధికారం లేదా అంటూ మండిపడ్డారు. ఇక పార్లమంట్‌లో ఇచ్చిన తెలంగాణ గురించే ప్రధాని మోది మాట్లాడరని వివరించారు.. బీజేపీ మద్దతు తోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు...

  Love story : ఈమె మాములు లవర్ కాదు.. పెళ్లైన మరునాడే, భర్తను రోడ్డుపై పెట్టి టాయ్‌లెట్‌కు వెళ్లింది..తీరా..

  మరి వచ్చిన తెలంగాణ లో ఏం జరుగుతుందని దుయ్యబట్టారు.... కుటుంబ పాలన, వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద వేదింపులు, ఆశ్రిత పక్షపాతం,బంధు ప్రీతి,అధికార దుర్వినియోగం,ధరణి పేరిట లక్షల ఎకరాలు మాయం చేయడం,ప్రజలకిచ్చిన వాగ్దానాలు మర్చిపోవడం,ఉద్యోగులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు,పెన్షన్ లు అందరికీ ఇవ్వకపోవడం,మధ్యాహ్న భోజనం వండే వారికి జీతాలు ఇవ్వకపోవడం,నాలుగేళ్లుగా చిన్న చిన్న బిల్లులు లేవు,డైట్ ఛార్జ్ ఇవ్వరు....ఇవన్నీ చేయాల్సిన మంత్రులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు.. .స్వయంగా రాష్ట్ర హోం మంత్రి ప్రధాని దిష్టి బొమ్మ తగలపెట్టడం పట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Eetala rajender, Karimnagar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు