Ertala Rajender : దళిత బంధుపై (Dalita Bandhu)తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఈటల రాజేందర్ (Eetala Rajender)అన్నారు. తనది కాని లేఖను సోషల్ మీడియాలో(Social media) పోస్టు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని డిమాండ్ చేసిందే.. తానని ఆయన గుర్తు చేశారు.
తనకు ఉన్న ఆదరణను తట్టుకోలేకనే టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతుందని ఈటల రాజేందర్ (Eetala Rajender) విమర్శించారు. టీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన హుజూరాబాద్ (Huzurabad) ప్రజలు తన వెంటే ఉన్నారని .. అందుకే ఏం చేయాలో తెలియక కొత్త కుట్రకు తెరలేపారని ఆయన విమర్శించారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో తనను తిట్టించడంతో పాటు గోడ గడియారాలు పగులగొట్టిస్తున్నారని అన్నారు. దీంతో నిన్న ఈటల రాజేందర్‌ను తిట్టిన కుటుంబానికి తాను ఏం చేసింది వివరించారు.
హుజూరాబాద్ మండలంలోని ప్రవీణ్ కుటుంబానికి తాను సబ్‌స్టేషన్‌లో ఉద్యోగం పెట్టించానని ఇక కుటుంబ యజమాని కొడుకు ప్రవీణ్‌కు కూడా హుజూరాబాద్ ఆసుపత్రిలో ఉద్యోగం పెట్టించానని ఆయితే ప్రవీణ్ మాత్రం ఆసుపత్రిలోని డాక్టర్‌తో కలిసి ప్రైవేటు ఆసుపత్రి పెట్టాడని, ప్రభుత్వ ఆసుపత్రికి (govt hospital) వస్తున్నవారిని తన ఆసుపత్రికి పంపించాడని, దీంతో పాటు మరో తప్పుడు పని చేయడం ద్వారా ఆసుపత్రి సూపరిండెంట్ సస్పెండ్ చేశాడని తెలిపారు. ఆ తర్వాత 6 నెలలకు ప్రవీణ్ గుండె పోటుతో చనిపోయాడని .. ఆ తర్వాత కూడా ఆయన భార్యకు కూడా ఉద్యోగం పెట్టించానని చెప్పారు. దీంతో నిన్న పాపయ్యపల్లికి వెళ్లడంతో ఆ కుటుంబాన్ని రెచ్చగొట్టి తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే నిన్న పాపయ్యపేటకు వెళ్లిన ఈటల రాజేందర్‌ను ప్రవీణ్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తన కుమారుడి చావుకు ఈటల రాజేందర్ కారణమంటూ ఆందోళనకు దిగారు. అయితే ఆ సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉండడంతో పాటు ఇటివల ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఇప్పించాడు. అయితే ఈటలను ప్రవీణ్ కుటుంబం అడ్డుకోవడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు దళిత బంధుకు వ్యతిరేకంగా తాను రాసినట్టుగా లేఖ సృష్టించి, ధర్నాలు చేయిస్తున్నారని అన్నారు. తాను అలాంటీ లేఖలు రాయలేదని స్పష్టం చేశారు. దళితులతోపాటు ఇతర కులాలకు కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలని తాను డిమాండ్ చేశారని చెప్పారు.
ఇలా ఇలా టీఆర్ఎస్ పార్టీ చిల్లర పనులకు పాల్పడుతూ.. ప్రజలను తనకు వ్యతిరేకంగా ఉసి గొల్పుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇలా గత నాలుగు నేలలుగా నియోజకవర్గంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారని, నాయకులకు దావత్‌లు పెట్టడడంతో పాటు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. దీంతో పాటు నాయకులను సైతం కోనుగోలు చేస్తున్నారని చెప్పారు. అయితే ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. మెజారిటీ ప్రజలు తనవెంటే ఉన్నారని ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని వావిలాల, ఇళ్లందకుంట , మరియు దర్మారం గ్రామాలకు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో (BJP) చేరిన సంధర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.