Eetala Rajender : కేసీఆర్ అహంకారానికి.. ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు

eetala rajender

Eetala Rajender : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలే కథానాయకులై తన గెలుపుకు కృషి చేయాలని ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ అక్రమంగా జారీ చేస్తున్న నిధులు, జీవోలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఉప ఎన్నికలని ఆయన పేర్కొన్నారు.

  • Share this:
    కేసీఆర్ (kcr)అహంకారానికి ,హుజూరాబాద్ (huzurabad)ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఈటల రాజేందర్(Eetala rajender) అన్నారు. అక్టోబరు 30 న జరిగే ఉప ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని ఆయన కోరారు.. టిఆర్ఎస్ పార్టీ నోట్లతో ఓట్ల కొనుగోలుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

    దొంగ ఓట్లకు కుట్ర

    మరోవైపు గతంలో వరంగల్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లను (fake votes)నమోదు చేసుకుని గెలిచినట్టుగానే హుజూరాబాద్‌లో కూడా అదే ప్రక్రియకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే కుట్ర జరుగుతుందని అన్నారు. ప్రజలకు తెలియకుండానే వారి ఇంట్లో దొంగ ఓట్లను సృష్టిందేందుకు టీఆర్ఎస్ కుటిల యత్నాలు చేస్తుందని ఆరోపించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బీజేపీ(Bjp) అడ్డుకుంటుందని చెప్పారు. దొంగ ఓట్ల నమోదుపై సంబంధిత అధికారులే తనకు సమాచారం అందిస్తున్నారని చెప్పారు.

    ఇది చదవండి :రెండు జిల్లాల్లో ఎన్నికల నియమావళి .. పథకాలు కొనసాగుతాయి.. !


    ప్రజా స్వామ్యం ఖూని

    ఎన్నికల్లో గెలవడం కోసం మంత్రులే స్వయంగా మద్యం, విందులతో నీచంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా మంత్రి హరీష్‌రావు,(harish rao ) వ్యవహరిస్తున్న తీరు సిగ్గు చేటని దుయ్యబట్టారు. ఈటల రాజేందర్‌కు మద్దతు పలికే వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతూ.. నీచపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారని ఆయన విమర్శించారు. వీటన్నిటిని ప్రజలు తిప్పికొడతారని ఈటల దీమా వ్యక్తం చేశారు.

    ఇది చదవండి : హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంట్‌డౌన్.. ఎవరి బలాలు ఏమిటి.. ?


    సీఎం కేసీఆర్ డైరక్షన్ ..హరీష్ రావు యాక్షన్

    టీఆర్ఎస్ పార్టీ కుట్రలు ,కుతంత్రాలు, డబ్బు సంచులతో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్న పార్టీకి శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. గత ఐదు నెలలుగా ముఖ్యమంత్రి కేసిఆర్(cm kcr) డైరక్షన్‌తో మంత్రి హరీష్ రావు , అరడజను మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం వందమంది వరకు గోర్లమంద మీద తోడేళ్లు పడ్డట్టు హుజూరాబాద్ పై పడ్డారని అన్నారు. పార్టీలో రాజీనామా చేయకముందే సొంత పార్టీ ప్రజా ప్రతినిధులను ప్రలోభ పెట్టి .. గత ఇరవై సంవత్సరాలుగా తనతో ఉన్న అనుబంధానికి చిచ్చుపెట్టారని అన్నారు. దీంతో హుజూరాబాద్ ప్రజానికాన్ని రకరకాల ప్రలోభాలతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారని.. అయినా నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈటల రాజేందర్‌కు అండగా నిలిచారని అన్నారు.

    ఇది చదవండి : హుజూరాబాద్ ,బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యుల్ విడుదల

    Published by:yveerash yveerash
    First published: