Eetala Rajender : మంత్రి హరీష్ రావు .. పెద్ద నీచుడు.. ఆయనపై వ్యవహారంపై ప్రజలు తూ.. అంటున్నరు...!

మరోవైపు రాష్ట్రంలో అనేకమంది కాలేశ్వరం బడా కాట్రక్టర్లు మంత్రి హరీష్ రావు నియోజకర్గంతో పాటు, ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్‌లో డబులు బెడ్‌ రూం ఇళ్లు నిర్మించారని , కాని తన నియోజకవర్గంలో మాత్రం అలాంటీ కాంట్రాక్టర్లు లేరని అన్నారు.

Eetala Rajendar : మంత్రి హరీష్ రావుపై ఈటల రాజేందర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన చేస్తున్న పనులు చూసి ప్రజలు తూ.. అని ఊంచుతున్నారని అన్నారు.. మరోవైపు సొంత పార్టీ వారినే డబ్బులిచ్చి కొనుగోలు చేస్తున్న నీచుడు అంటూ ఫైర్ అయ్యారు.

 • Share this:
  హుజూరాబాద్‌లో (Huzurabad) మంత్రి హరీష్‌ రావు(Harish rao) ప్రత్యక్షంగా ఎంటర్ కావడంతో రాజకీయాలు మరింత ముదిరాయి.. ఈటల రాజేందర్ (Eetala Rajendar) టార్గెట్‌గా హారీష్ రావు పావులు కదుపుతుండడంతో పాటు ఆయనపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈనేపథ్యంలోనే హరీష్ అభివృద్ది నిధులు కావాలా, ఈటల రాజేందర్ కావాలా అంటూ నేరుగా ప్రశ్నిస్తున్నారు. అభివృధ్ది మంత్రాన్ని జపిస్తూనే మరోవైపు పార్టీ శ్రేణులపై గురి పెట్టారు. ఈటలకు మద్దతు ఇస్తున్నవారిని నయానా భయానా అనుకూలంగా మార్చుకుంటున్నారు.

  ఈ క్రమంలోనే హారీష్ రావుపై ఈటల రాజేందర్ తాజాగా విరుచుకుపడ్డారు. ఆయన నీచపు రాజకీయాలకు(Telangana politics) దిగుతున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి హారీష్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఉమ్మివేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రిగా ఉంటూ ఆర్థరాత్రి తన అనుకూలుర ఇళ్లలోకి వెళ్లి కొనుగులు చేస్తున్న నీచుడని అన్నాడు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా డబ్బులిచ్చి కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరికి వేయి రూపాయల నుండి రెండు వేల రూపాయలు ఇస్తూ.. ప్రజలను కూడా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఇక పెన్షన్లు, దళిత బంధు(Dalita Bandhu) ఇస్తూ తమకే ఓటు వేయాలని దొంగచాటు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

  ఇది చదవండి :  భర్తతో వీడియో కాల్ కట్ చేసింది, అంతే... రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది..!


  మంత్రి హారీష్ రావుపై ప్రజలకు కొంత సాఫ్ట్ కార్నర్ ఉందని, తెలంగాణ ఉద్యమ(Telangana) కాలం నుండి కలిసి పని చేసిన తననే టార్గెట్ చేయడంతో ఆయన పతనం ప్రారంభమైందని అన్నారు. దీంతో ఆయన్ను ప్రజలు ఈసడించుకునే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. తాను వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారని చేస్తున్న హరీష్ రావు , ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చుపెడుతున్న డబ్బులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఆయన వ్యక్తిగతంగా ప్రతి పనికి కమీషన్లు తీసుకుని వేల కోట్లు సంపాదించారని అన్నారు.

  ఇది చదవండి : తాలిబాన్ ఎఫెక్ట్..! హైదరాబాద్ బిర్యానీ ధరలు హైక్ .. కారణం ఇదే...


  ముఖ్యంగా గతంలో హరీష్ రావు వేరని, ఇప్పుడున్న హరీష్ రావు వేరని అన్నారు.. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి (cm kcr) చెప్పిన వారికే ఆర్థిక మంత్రిగా నిధులు విడుదల చేస్తున్న కీలుబోమ్మ అని విమర్శించారు. తాము ముఖ్యమంత్రి సీటు కోసం ప్రయత్నించానని చెబుతున్న హరీష్ రావుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎవరి బాగోతాలు ఏమిటో త్వరలో ప్రజలు తెలుస్తుందని అన్నారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు డబ్బులు పంపిణి చేసింది హరిష్ రావు కాదా అని గుర్తు చేశారు. మరోవైపు తాను గులాబి పార్టీ ఓనర్లం అనే.. ఓకే ఒక్క ప్రకటనతో హరీష్ రావుకు మంత్రి దక్కిన విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు.

  ఇది చదవండి : రేవంత్ రెడ్డి ఓ సెప్టిక్ ట్యాంక్.. నేను ఆయన గురించి మాట్లాడను..!


  ఇక తాను ఉద్యోగాలు పెట్టిచ్చిన వారిని బెదిరించి ఉన్న ఉద్యోగాలు కూడా తీయించి వేస్తున్నారని, మరోవైపు చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తున్న వారిని కూడా వదలకుండా బిల్లులు రావాలంటే టీఆర్ఎస్‌కు అనుకూలంగా పని చేయాలని ఒత్తిడి తెస్తున్నారని దుయ్యబట్టారు. హరీష్ రావు, తలకాయ కిందకి , కాళ్లు పైకి పెట్టినా.. టీఆర్ఎస్ హుజూరాబాద్‌లో గెలవదని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.
  Published by:yveerash yveerash
  First published: