EETALA RAJENDER FIRES ON KCR OF HIS COMMENTS ON PADDY VRY
Eetala rajender : ధాన్యం మొత్తం తానే కొంటున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు కదా.. ?
ఈటల రాజేందర్ (ఫైల్)
Eetala rajender : సీఎం కేసిఆర్ వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గత నలబై రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆయన విమర్శించారు.
సీఎం కేసీఆర్ మహాధర్న ముగిసిన తర్వాత బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. ధాన్యం కొనుగోలులో సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గతంలో సీఎం కేసిఆర్ మొత్తం ధాన్యం రాష్ట్రమే కొనుగోలు చేస్తుందని చెప్పారని అన్నారు. కేసీఆర్ తన కీర్తి కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 40 రోజులుగా ధాన్యం కొనటం లేదని ఈటల దుయ్యబట్టారు. ఇక హుజురాబాద్ ఎన్నికల ఫలితం తర్వాతే కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి బయటకు వస్తున్నారన్నారని అన్నారు.. గతంలో ధాన్యం మొత్తం తానే కొంటున్నట్లు కేసీఆర్ గతంలో చెప్పలేదా? అని ప్రశ్నించారు.. మరి ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం లేదని అన్నారు.
రైతులను కన్ఫ్యూజ్ చేసేందుకు ఒకసారి వరి వేయొద్దన్నారు.. ఒకసారి పత్తి, సన్నవడ్లు వద్దన్నారని దుయ్యబట్టారు... ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పెట్టిన ఖర్చు రాష్ట్ర రైతుల కోసం పెట్టేలేరా? అని ప్రశ్నించారు..ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన విపక్ష నేతలను నరుకుతా, ముక్కలు చేస్తా అని దిరించడం సబబేనా?’’ అని ఈటల ప్రశ్నించారు.
మరోవైపు సీఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర అధికారులు స్పష్టత ఇచ్చారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితి అందుకు అనుగుణంగా లేదని తెలిపారు. ఇక వచ్చే రభీ సీజన్లో ఆయా రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే ఎంత ధాన్యం సేకరించాలో స్పష్టం చేస్తామని వివరించారు. ఇప్పటి వరకు బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసిందని కాని ప్రస్తుతం వరితో పాటు గోధుమలు కూడా అవసరానికి మించి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇక రైతులు సైతం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వారు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.