EETALA RAJENDER FIRES ON CM KCR FOR NOT TO ATTEND IN REPUBLIC DAY CELEBRATIONS IN RAJBAVAN VRY
Eetala Rajender on cm kcr : సీఎం కేసీఆర్ గవర్నర్‌ను అవమానించారు.. రిపబ్లిక్ వేడుకల వివాదం
ఈటల రాజేందర్ (ఫైల్)
Eetala Rajender on cm kcr : సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో నిర్వహించిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనకుండా రాజ్యంగ వ్యవస్థను అవమానపరిచారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన సీఎం ఇలా వ్యవహరించడం సబబు కాదని ఆయన హితవు పలికారు..
రిపబ్లిక్ వేడుకలు మరోసారి బీజేపీటీఆర్ఎస్ పార్టీల మధ్య వివాదాన్ని రేపుతాయా.. రాష్ట్ర గవర్నర్‌ను సీఎం కేసీఆర్ అవమానించారా..? రాజ్యంగా వ్యవస్థకు అనుకూలంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ అందుకు వ్యతిరేకంగా వ్యవహరించారా అంటే అవుననే అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నేడు 73వ రిపబ్లిక్ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అయితే ఉమ్మడి నిర్వహించాల్సిన వేడుకల్లో ఎవరికి వారే పాల్గొనడం వివాదస్పదంగా మారింది.
ఈ క్రమంలోనే రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్‌తో పాటు సీఎం కేసీఆర్ పాల్గనాల్సి ఉండగా ఆయన మాత్రం పాల్గొనలేదు.. దీంతో ఈటల రాజేందర్ విమర్శించారు.. ఇది మంచి పద్దతి కాదని ఆయన హితవు పలికారు. సీఎం వేడుకల్లో పాల్గొనకపోవడం గవర్నర్ వ్యవస్థను అవమానపరిచినట్టేనని ఆయన దుయ్యబట్టారు. రాజ్యాంగబద్దంగా ఉండాల్సిన పదవులను ఆయన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు ఏదైనా అనారోగ్య పరిస్థితి కూడా లేదని, ఆయన ప్రగతిభవన్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్లో అమరవీరుల స్థూపానికి నివాళులు కూడా అర్పించారని అయినా రాజ్‌భవన్‌కు రాలేదని చెప్పారు. కనీసం ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ మంత్రిని కూడా పంపించలేదని విమర్శించారు.
మరోవైపు రాజ్యంగా పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సైతం రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని రాజకీయ పరమైన విమర్శలు చేయడం కరెక్టు కాదని అన్నారు. ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరాన్ని పెంచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు.
కాగా నేడు నిర్వహించాల్సిన రిపబ్లిక్ వేడుకలు కరోనా కారణంగా కేవలం రాజ్‌భవన్ కార్యాలయాల్లోనే నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దీంతో సాధారణంగా సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకలను రద్దు చేశారు. అయితే ఈ వేడుకల్లో రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్‌తో పాటు సీఎం పాల్గొనాల్సి ఉందని ఈటల రాజేందర్ చెప్పారు. అయితే సీఎం పాల్గొనలేదని, కనీసం సీనియర్ మంత్రిని కూడా పంపలేదని చెప్పారు. ఈ రకంగా రాజ్యంగా ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు. పార్టీలు, ప్రభుత్వాలు శాశ్వతం కాదని, కాని రాజ్యాంగం మాత్రం శాశ్వతం అని చెప్పారు. రాజ్యంగా సాంప్రదాయాలను సీఎం తుగ్గలో తొక్కారని విమర్శించారు. ఇది చాలా దురదృష్టకరం, అంత్యంత బాధకరమని అన్నారు.. రాజ్యంగం ద్వారా పదవులు అనుభవిస్తు దాన్నే ఉల్లంఘించడం సబబు కాదని అన్నారు. దీనిపై సీఎం వివరణ ఇవ్వాలని అన్నారు.
సో మొత్తం మీద మరోసారి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రాజ్యంగ పరమైన వివాదం కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నేతల మధ్య హోరాహోరి మాటల యుద్దంతో పాటు కొట్టుకునే వరకు చేరింది. ఇప్పుడు తాజాగా ఇలా ఉన్నతమైన పదవుల్లో కూడా విమర్శలు రావడం రాజకీయ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.