ధాన్యం కొనుగోళ్లలో రైతుల పడుతున్న ఇబ్బందులను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ( Eetala Rajender ) ఎకరవు పెట్టారు. ప్రభుత్వ విధానంపై ఆయన మండిపడ్డారు. ప్రస్తత సీజన్‌లో కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన విమర్శించారు. సీఎం కేసిఆర్‌కు ( cm kcr ) ముందు చూపు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీంతో తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారని అన్నారు. సీఎం కేసిఆర్ ఇప్పటికైన రాజకీయాలు మానుకుని ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల జీవీతాలతో చెలగాటమాడిన వారు ఎవరు బతికి బట్టకట్టలేదని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం ( central govt ) రైతు చట్టాలను ( Farm laws ) వెనక్కి తీసుకుని రైతులకు క్షమాపణలు చెప్పి హుందాగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా నేను కొనలేదని రైతులకు క్షమాపణ చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బందులకు గురి చేస్తే సమయం చూసి దెబ్బకొడతారని హెచ్చరించారు. ఇక ధాన్యం రోడ్లపై తడిచి మొలకెత్తుతున్నాయని, ఆ ధాన్యం మొత్తం నాలుగు రోజుల్లో కొనుగోలు చేయకపోతే... జిల్లా కలెక్టరేట్ల ముందు మరోసారి ధర్నాలు చేస్తామని ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇది చదవండి : చరిత్రలో రికార్డు ఆదాయాన్ని పొందిన ఆర్టీసీ.. ఎంతంటే..
మరోవైపు తెలంగాణలో రైతులు కల్లాలో రైతులు కన్నీరు పెడుతుంటే .. సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీలో (Delhi ) సేదతీరుతున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth reddy ) విమర్శించారు. సీఎం కేసీఆర్ తీర్థయాత్రలతో రైతులకు ఒరిగేదేమి లేదని ఆయన మండిపడ్డారు. వానాకాలం పంట కొనుగోలు చేయకుండా ఇప్పుడు యాసంగి పంటల కోసం పంచాయితీ ఏంటని ఆయన ప్రశ్నించారు. రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్స్ంగ్ చేసుకున్నాయని ఆయన ఆరోపణలు చేశారు.ఇరుపార్టీల చదరంగరంలో రైతు పావుగా ( Farmers) మారడాని ఆయన అన్నారు. రైతుల సమస్యలపై వినతి పత్రాలు తీసుకోవడం తోపాటు వారికి మద్దతుగా రెండు రోజుల పాటు పలు కార్యక్రమాలకు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పార్టీ నేతలు , ( Telangana congress party ) రైతుల వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సీఎం కేసిఆర్‌పై మండిపడ్డారు.
ఇది చదవండి : ఎమ్మెల్సీ కవిత ఎన్నిక ఇక ఏకగ్రీవమే..? ఇండిపెండెండ్ అభ్యర్థి నామినేషన్‌లో వివాదం
గత రెండు రోజులుగా టీఆర్ఎస్ మంత్రుల బృందంతో పాటు సీఎం కేసిఆర్ సైతం ఢిల్లీలో మకాం వేశారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇచ్చే వరకు ఢిల్లీలో ఉంటామని తేల్చి చెప్పడంతో పాటు మంత్రి పియూష్ గోయల్‌తో సమావేశం అయ్యారు. అయితే బాయిల్డ్ రైస్ ను ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చేయమని మంత్రి స్సష్టం చేయడంతో పరిస్థితి యదావిధిగా కొనసాగుతోంది. అయితే తెలంగాణలో యాసంగి పంట మొత్తం బాయిల్డ్ రైస్‌గా ఉంటుందని అలాంటప్పుడు కొనుగోలు చేయమని స్పష్టం చేయాలని రాష్ట్ర మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eetala rajender, Telangana