• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • EDUPAYALA VANA DURGABHAVANI TEMPLE CLOSED FOR 7 DAYS AS TEMPLE EO TESTED CORONA POSITIVE IN TELANGANA SK

Telangana: కరోనా కల్లోలం.. నేటి నుంచి ఏడుపాయల ఆలయంలో దర్శనాలు రద్దు

Telangana: కరోనా కల్లోలం.. నేటి నుంచి ఏడుపాయల ఆలయంలో దర్శనాలు రద్దు

ఏడుపాయల ఆలయంలో భక్తుల దర్శనాలు రద్దు

ఏడుపాయలలో గత వారమే జాతర జరిగింది. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు శివరాత్రి ఉత్సవాలకు హాజరై ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.

  • Share this:
    కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. తగ్గినట్టే తగ్గి కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు మూతపడుతున్నాయి. బస్సులను రద్దు చేస్తున్నారు. పార్కులు, దేవాలయాల్లోకి అనుమతి నిరాకరిస్తున్నారు. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గాభవాని ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. ఆలయ ఈవోకు కరోనా సోకడంతో భక్తుల దర్శనాలను రద్దు చేశారు.

    నేటి నుంచి వారం రోజుల పాటు ఏడుపాయల ఆలయంలోకి భక్తులను అనుమతించరు. మార్చి 25 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఐతే ఆలయంలో యథావిధిగా కైంకర్యాలు జరుగుతాయని తెలిపారు. కేవలం భక్తులకు మాత్రమే అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈవోకు కరోనా సోకడంతో ఆలయం అధికారులు అప్రమత్తమయ్యారు. సిబ్బంది అందరికీ కోవిడ్ పరీక్షలను చేస్తున్నారు.

    ఐతే గత వారమే ఇక్కడ జాతర జరిగింది. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు శివరాత్రి ఉత్సవాలకు హాజరై ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. ఇప్పుడు వారందరిలోనూ టెన్షన్ నెలకొంది.

    కాగా, తెలంగాణలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ 300కి పైగా న‌మోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్త‌గా 313 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్ద‌రు మరణించార. మరో 142 మంది కోలుకున్నారు. తాజా లెక్కలతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,262 మంది కోలుకున్నారు. 1,664 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,434 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 943 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు