(K. Veeranna, News 18, Medak)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల (Edupayala) వనదుర్గామాత ఆలయాన్ని (Vana Durga Temple) శనివారం వరదనీరు చుట్టు ముట్టింది. శుక్రవారం రాత్రి మండలంతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురవడంతో ఆలయ సమీపంలోని వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతుంది. తెల్లవారు జామున అర్చకులు మాత్రమే ఆలయంలోకి వెళ్లి అమ్మవారికి అభిషేకం సహస్రనామార్చన చేపట్టి తదుపరి ఆలయాన్ని మూసివేశారు. భక్తుల సౌకర్యార్థం రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు, ప్రజలు ఆలయం వైపు వెళ్లకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు చేపట్టారు. ఈ ప్రాజెక్టు నుంచి 22,000 క్యూసెక్కుల వరద (Floods) నీరు దిగువకు ప్రవహిస్తుందని నీటిపారుదల శాఖ ఇంజినీర్ తెలిపారు.
పెరగనున్న ప్రవాహం..
సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తుండంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 31,920 క్యూసెక్కుల నీటిని శనివారం దిగువకు విడుదల చేశారు. ఆ నీరు ఆదివారం. మధ్యాహ్నం వరకు వనదుర్గా (Vanadurga) ప్రాజెక్టుకు చేరనుంది. దీంతో ఏడుపాయల ఆలయం వద్ద ప్రవాహం పెరగనుంది. వరద (Floods) తీవ్రత పెరగనున్నందున మంజీరా పరివాహక ప్రజలు, ఏడుపాయలకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని జిల్లా పాలనాధికారి హరీశ్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోతంశెట్టి పల్లి వైపు నుంచి ఆలయానికి వచ్చే మార్గాన్ని మూసి వేయాలని చెప్పారు.
నీటిపారుదల డీఈ శివనాగరాజు ఆర్డీవో సాయిరాం రాజగోపురంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి శనివారం సాయంత్రం రాజగోపురంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సమస్యలు ఉంటే ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఆమె అధ్యక్షుడు సోములు, ఎంపీపీ చందనా రెడ్డి, పాలక మండలి ఛైర్మన్ బాలాగౌడ్ వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్రెడ్డి ఉన్నారు.
@balaji25_t Getting heavy flow at Edupayala Vana Durga Bhavani temple #Telanganarains #Weathercloud #medak pic.twitter.com/lgxFYqcKG3
— Suresh Dontha (@donthasuresh) July 23, 2022
ఆందోళన వద్దు మేమున్నాం..
పట్టణంలో ఆటో నగర్ , సాయి నగర్ వెంకట్ నగర్ కాలనీలలో నిన్న రాత్రి కురిసిన వర్షం నీరుతో రోడ్లు నిండి పోయిన విషయాన్ని తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శనివారం ఉదయం మెదక్ పట్టణానికి చేరుకొని అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కమిషనర్ శ్రీహరితో కలిసి రోడ్లను పరిశీలించారు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, నీటిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వెంకట్ నగర్ సాయి నగర్ కాలనీలలో జెసిపి పైన వెళ్లి నీట మునిగిన రోడ్లను ఇండ్ల మధ్య చుట్టుముట్టిన ప్రాంతాలను పరిశీలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.