Home /News /telangana /

EDUCATION MINISTER SABITHA INDRA REDDY HAS ISSUED SEVERAL GUIDELINES FOR SCHOOLS IN TELANGANA IN CELEBRATIONS OF INDEPENDENCE PRV

Schools and Colleges: విద్యాసంస్థలకు అలెర్ట్​.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

మంత్రి సబిత (ఫైల్​)

మంత్రి సబిత (ఫైల్​)

విద్యాశాఖ, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారులతో మంత్రి సబిత వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థలకు కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణలోని (Telangana) విద్యాసంస్థల్లో 15 రోజులపాటు స్వతంత్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట యోధులను స్మరిస్తూ వేడుకలు కొనసాగించాలని ఆమె  తెలిపారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖ, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రకటించారు. తెలంగాణలోని విద్యాసంస్థల్లో (Schools and Colleges) 15 రోజులపాటు పండుగ వాతావరణం నెలకొనేలా చూడాలన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఆగస్టు 8 నుంచి 22 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

    స్వాతంత్య్ర పోరాటాలు, త్యాగాలు, నాటి జాతీయ నాయకులు, అమరుల వివరాలు నేటి తరానికి తెలిసేలా వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, సాం సృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని వివరించారు. 10న వజ్రోత్సవ వన మహోత్సవాన్ని నిర్వహించి ప్రతి విద్యాసంస్థలో (Schools and Colleges) కనీసం 75 మొక్కలు నాటాలని సూచించారు.



    ఆగస్టు 8 నుంచి 22 వరకు..

    కాగా, ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ లో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే రోజు వారీ కార్యక్రమాలను సీఎం రెండు రోజుల కిందటే సమీక్షించారు. ఆగస్టు 15 న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతిఇంటి పై జాతీయ జెండా కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా తీసుకోవాల్సిన చర్యలను సిఎం కెసిఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి 9వ తేదీనుంచే రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాల (National Flags) పంపిణీ చేపట్టాలని సిఎం కెసిఆర్ (CM KCR) అధికారులను ఆదేశించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలు గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో జరగాలన్నారు.

    వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహాన్ని ఆగస్టు 8న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆర్మీ/పోలీస్‌ బ్యాండ్‌తో రాష్ట్రీయ శాల్యూట్‌.. జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనను నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం స్వాగతోపన్యాసంతోపాటు, అధ్యక్షుల తొలి పలుకుల తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రసంగం, వందన సమర్పణ ఉంటుంది.

    కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, అన్ని జిల్లాల రైతుబంధు సమితి అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌వోడీలు, జిల్లా కేంద్రాల్లో ఉండే ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు, ఆర్మీ వాయుసేన తదితర రక్షణ రంగానికి చెందిన కమాండర్లు, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యాధికారులు మొత్తంగా రెండు వేల మంది ఆహూతుల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Colleges, Independence Day, Schools, Telangana Government, Telangana schools

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు