Home /News /telangana /

EDUCATION DEPARTMENT SUBMITTED REPORT TO HIGH COURT ON SSC EXAMS ARRANGEMENTS AK

పదో తరగతి పరీక్షలపై హైకోర్టుకు విద్యాశాఖ నివేదిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం తీసుకున్న జాగ్రత్తలు, చేయబోయే ఏర్పాట్లపై హైకోర్టుకు విద్యాశాఖ నివేదిక సమర్పించింది.

    పదో తరగతి పరీక్షా కేంద్రాల సంఖ్యను 2530 నుంచి 4535కి పెంచామని విద్యాశాఖ వెల్లడించింది. పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం తీసుకున్న జాగ్రత్తలు, చేయబోయే ఏర్పాట్లపై హైకోర్టుకు విద్యాశాఖ నివేదిక సమర్పించింది. 10వ తరగతి విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు ఇవ్వడం లేదని పేర్కొంది. పరీక్ష కేంద్రాల వివరాలను విద్యార్థులకు సమాచారం ఇచ్చామని తెలిపింది. కేంద్రానికి ఒకరు చొప్పున మొత్తం 4535 మంది వైద్య సిబ్బంది కేటాయించామని నివేదికలో వెల్లడించింది. ఇందుకోసం డీఈవో కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పింది. హైదరాబాద్‌లో విద్యార్థులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నట్టు వివరించింది. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలు ఉండవని స్పష్టం చేసింది. పరీక్షా హాల్లో ఒక్కో విద్యార్థికి 5 నుంచి 6 అడుగుల డిస్టెన్స్ ఉండేలా కచ్చితమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

    తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 8న ఇంగ్లీష్ పేపర్, 11న ఇంగ్లీష్ పేపర్ 2, 14న మ్యాథ్స్ పేపర్ 1, 17న మ్యాథ్స్ పేపర్ 2, 20న సైన్స్ పేపర్ 1, 23న సైన్స్ పేపర్ 2, 26న సోషల్ స్టడీష్ పేపర్ 1, 29న సోషల్ స్టడీష్ పేపర్ 2 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 2న ఓరియంటల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌(సంస్కృతం మరియు అరబిక్‌)
    జులై 5న ఒకేషనల్‌ కోర్సు(థియరీ) పరీక్షలను నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల గ్యాప్ ఇవ్వనున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ssc exams, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు