Home /News /telangana /

ESI scam :ఈడీ తనిఖీల్లో భారిగానే నగలు , నగదు స్వాధీనం

ESI scam :ఈడీ తనిఖీల్లో భారిగానే నగలు , నగదు స్వాధీనం

ED RAIDS

ED RAIDS

ESI SCAM ; సోదాల్లో భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్న ఈడి, కొససాగుతున్న సోదాలు, స్కాంలో ఆరోపణలు ఎదుర్కోంటున్న వారి ఇళ్లలో సోదాలు

ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఈడి హైదరాబాద్ లో పది చోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు దేవికారాణి నివాసంలోనే కాకుండా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న పలువురి నివాసాల్లో ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగానే మాజీ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి అల్లుడు శ్రీనివాస రెడ్డి ఇంట్లో కూడ ఈడీ సోదాలు నిర్వహించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో నుండి భారీగానే డబ్బు , నగలు ఇతర ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కాగా శ్రీనివాస రెడ్డి ఇంట్లో రూ కోటికి పైగా విలువైన నగలు, ఎక్కువ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. శ్రీనివాసరెడ్డి తోపాటు నాయిని మాజీ పీఎస్ ముకుంద రెడ్డి బంధువు అయిన వినయ్ రెడ్డి ఇంట్లో కూడ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

కాగా తెలంగాణలో ఈఎస్ఐ మందుల కుంభకోణం సంచలనం రేపిన విషయం తెలిసిందే..దీంతో ఈ కేసులో మాజీ డైరక్టర్ అయిన దేవికారాణితో పాటు ఏసీబీ పలువురిపై కేసు నమోదు చేసి అరెస్టులు చేసి విచారించింది. కాగా ఈ కుంభకోణంలో 6 కోట్లకు పైగా మందుల కొనుగోలుకు సంబంధించి నకిలీ బిల్లులు సృష్టించి కాజేశారనే ఆరోపణలు ఎధుర్కోంటున్నారు. అయితే దేవికా రాణి అరెస్ట్ తర్వాత సుమారు నాలుగన్నర కోట్ల రూపాయలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. కాగా మరోసారి నేరుగా ఈడీ మందుల కుంభకోణం ఆరోపణలు ఎదుర్కోంటున్న వారి ఇళ్లలో చాలా రోజుల తర్వాత దాడులు నిర్వహించడం చర్చనీయంశంగా మారింది.
Published by:yveerash yveerash
First published:

Tags: Esi scam

తదుపరి వార్తలు