హోమ్ /వార్తలు /తెలంగాణ /

Casino Case: క్యాసినో గ్యాంగ్‌తో టాలీవుడ్ హీరోయిన్లకు సంబంధాలు.. ఈడీ వద్ద ఆధారాలు

Casino Case: క్యాసినో గ్యాంగ్‌తో టాలీవుడ్ హీరోయిన్లకు సంబంధాలు.. ఈడీ వద్ద ఆధారాలు

చికోటి ప్రవీణ్

చికోటి ప్రవీణ్

Casino Case: చికోటి ప్రవీణ్‌తో సంబంధమున్న వారిలో తెలంగాణ మంత్రి, ఏపీ మాజీ మంత్రితో పాటు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలతోనూ ప్రవీణ్‌కు పరిచయాలు ఉన్నాయి

  హైదరాబాద్‌లో బట్టబయలైన క్యాసిన్ గ్యాంగ్ (Casino Case) వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విదేశాల్లోని క్యాసినోలకు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను తీసుకెళ్తూ.. ఫెమా నిబంధనలను ఉల్లంఘిస్తున్న.. టూర్ ఆపరేటర్లపై ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కొరడా ఝులిపిస్తోంది. ఈ కాసినో వ్యవహారంలో కీలకంగా ఉన్న  చికోటి ప్రవీణ్ , మాధవ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌస్‌లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. బుధవారం మొత్తం 8 చోట్ల సోదాలు చేసి.. కీలక ఆధారాలను సేకరించారు.  ఈ క్రమంలోనే వీరికి సినీ హీరోయిన్లు, రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి.


  చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డిలు గోవా క్యాసినోలను నిర్వహించడంతో పాటు శ్రీలంక, నేపాల్,  ఇండోనేసియా, థాయ్‌లాండ్‌లో క్యాసినోలకు ప్రముఖలను తీసుకెళ్తున్నారు. మనదేశానికి చెందిన రాజకీయ నాయకులు, సంపన్నులకు ప్రత్యేకమైన టూర్లు ఏర్పాటు చేశారు.  రానుపోను ఖర్చులతో పాటు ఐదు రోజులు ఉండేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇటీవల నేపాల్‌లో క్యాసినోకు 10 మంది టాలీవుడ్ ప్రముఖులు వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. ఈ జూదం పర్యటనలతో ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. విదేశాల్లో జూదం ఆడేందుకు దొడ్డిదారిన డబ్బులను తీసుకెళ్తున్నారని.. అక్కడ గెల్చుకున్న డబ్బును కూడా అక్రమ మార్గాల్లోనే ఇండియాకు తీసుకొస్తున్నారని తేలింది.  ఇటీవల హైదరాబాద్‌ (Hyderabad) చెందిన ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బును గెలిచి.. దానిని హవాలా మార్గంలో ఇక్కడికి మళ్లించినట్లు ఈడీకి సమాచారం అందింది. దాని ఆధారంగానే క్యాసినో టూర్ ఆపరేటర్లపై దాడులు చేస్తోంది ఈడీ.


  ప్రవీణ్ ఈ మధ్య నేపాల్‌పై ఎక్కువ దృష్టి సారించినట్లు ఈడీ విచారణలో తేలింది. గత నెలలో నిర్వహించిన క్యాసినో కోసం అమీషా పటేల్, ఈషా రెబ్బా, ముమైత్ ఖాన్, డింపుల్ హయతీతో ప్రచారం చేయించాడు. క్యాసినోకు వస్తున్నట్లు హీరోయిన్లతో చెప్పించి.. పంటర్లను ఆకర్షించాడు. గతంలో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేసిన మాధవ రెడ్డి.. ప్రవీణ్ దందాలో చేరిన తర్వాత బాగా డబ్బులు సంపాదించినట్లు సమాచారం. ఈడీ సోదాల సమయంలో మాధవ రెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి (Mallareddy) స్టిక్కర్ ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. ఐతే రెండేళ్ల క్రితమే ఎమ్మెల్యే స్టిక్కర్‌ని పడేశానని.. దానిని ఎవరో వాడుతుంటే తనకేంటి సంబంధమని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

  చికోటి ప్రవీణ్‌తో సంబంధమున్న వారిలో తెలంగాణ మంత్రి, ఏపీ మాజీ మంత్రితో పాటు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలతోనూ ప్రవీణ్‌కు పరిచయాలు ఉన్నాయి. బుధవారం నిర్వహించిన సోదాల్లో ఈడీ కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చికోటి ప్రవీణ్‌తో పాటు మాధవ రెడ్డికి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఐతే గోవాతో పాటు నేపాల్‌లో క్యాసినో ఇల్లీగల్ కాదని.. తానేం తప్పు చేయలేదని చికోటి ప్రవీణ్ చేశారు. ఐతే డబ్బులను హవాలా మార్గాల్లో తరలిస్తున్నారన దానిపైనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Hyderabad, Telangana, Telangana News

  ఉత్తమ కథలు