హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking News: టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ బిగ్ షాక్..రూ. 80.65 కోట్ల ఆస్తులు అటాచ్

Breaking News: టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ బిగ్ షాక్..రూ. 80.65 కోట్ల ఆస్తులు అటాచ్

నామా నాగేశ్వర్ రావు

నామా నాగేశ్వర్ రావు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు (Nama Nageshwar Rao)కు బిగ్ షాక్ తగిలింది. రుణాల పేరిట మోసం చేసిన కేసులో ఆయన ఆస్తులను ఈడీ (Enforcement Directorate) అటాచ్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు (Nama Nageshwar Rao)కు బిగ్ షాక్ తగిలింది. రుణాల పేరిట మోసం చేసిన కేసులో ఆయన ఆస్తులను ఈడీ (Enforcement Directorate) అటాచ్ చేసింది. నామా నాగేశ్వర్ రావు (Nama Nageshwar Rao) కుటుంబానికి చెందిన రూ. 80.65 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. జూబ్లీహిల్స్ లోను మధుకాన్ గ్రూప్  కార్యాలయంతో సహా హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రుణాల పేరిట సుమారు 361.92 కోట్లు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు ఆయన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Bhadradri: ఇంటర్, డిగ్రీ పాసైన వారికి స్కిల్ ట్రైనింగ్, జాబ్స్ కూడా: ఈ సంస్థ చేస్తున్న సేవకు సలాం!

 ఈ కేసుకు సంబంధించి నామా నాగేశ్వర్ రావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు పలు సంస్థలతో గతంలో సోదాలు జరిపారు. ఈ ఏడాది జూలై 2న మధుకాన్ గ్రూప్ సంస్థలకు చెందిన ఆస్తులను జప్తు చేశారు. అలాగే నామా  (Nama Nageshwar Rao) కుటుంబసభ్యుల ఇళ్లలోనూ గతేడాది జూన్ మాసంలో ఈడీ  (Enforcement Directorate) అధికారులు తనిఖీలు చేపట్టారు.  దీనికి సంబంధించి గతేడాది ఈడీ  (Enforcement Directorate) విచారణకు నామా నాగేశ్వర్ రావు  (Nama Nageshwar Rao) హాజరు కాలేదు. రాంచి ఎక్స్ ప్రెస్ హైవే నిధుల మళ్లింపు కేసులో మధుకాన్ సంస్థల డైరెక్టర్లు హాజరయ్యారు. రాంచి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కోసం మధుకాన్ కంపెనీ బ్యాంకుల నుండి సుమారు రూ.1064 కోట్ల రుణం తీసుకుంది.

అయితే ఇందులో సుమారు రూ.264 కోట్లు దారి మళ్లాయని సీబీఐ (Central Burew of Investigation) గుర్తించింది. ఈ మేరకు 2019వ సంవత్సరంలో సీబీఐ (Central Burew of Investigation) కేసు నమోదు చేసింది.

ఈ కేసులో భాగంగా మధుకాన్ కంపెనీకి సంబంధించిన కార్యాలయాలపై రాంచి ఎక్స్ ప్రెస్ హైవేపై సీఎండీ కార్యాలయం, డైరెకర్ల నివాసాల్లో గతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

First published:

ఉత్తమ కథలు