EASY TO GET DRIVING LICENCE FOR HANDICAPPED OFFICIALS REVIEW VRY ADB
Adilabad : మీరు దివ్యాంగులా.. డ్రైవింగ్ లైసెన్స్ కావాలా అయితే స్టోరీ చదవండి..
ప్రతీకాత్మక చిత్రం
Adilabad : మీరు దివ్యాంగులా... డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం గగనం అవుతుందా అయితే మీరు ఓ సారి ఈ స్టోరీ చదవాలి ఆర్టీఏ అధికారులు దివ్యాంగులు ఎలా లైసెన్స్ పోందాలో వివరించారు.
డ్రైవింగ్ లైసెన్స్ అంటేనే ఓ ప్రహసనం .. దాన్ని సాధించాలంటే అనేక పాట్లు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగతంగా ఏం చేసినా చివరకు ఎవరో ఒకరు బ్రోకర్‌ను పట్టుకుంటే గాని సామాన్యులకు డ్రైవింగ్ లైసెన్స్ రాని పరిస్థితి నెలకొంటుంది. కాని ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం దివ్యాంగులకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ పోందడం చాల సులభం అని చెబుతున్నారు స్థానిక అధికారులు అందుకోసం ఏం చేయాలో చెబుతున్నారు..
ఎవరైనా ఈ రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందటమంటే తడిసి మోపెడవుతోంది. అన్ని సక్రమంగా ఉన్నా డ్రైవింగ్ లైసెన్స్ కోసం రోజుల తరబడి సంబంధిత కార్యాలయం చుట్టు ప్రదక్షణలు చేయక తప్పదు. ఖర్చులు తడిసి మోపెడు కాకమానదు. చివరకు తిరిగే ఓపిక లేనివారు మధ్య దళారులను ఆశ్రయించి, వారి ద్వారా పని చేయించుకోక తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో దివ్యాంగులు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే అధికారులు ఎన్ని కొర్రీలు పెడతారో, ఎన్ని సార్లు కార్యాలయం చుట్టు తిప్పుకుంటారోనన్న అనుమానం కలుగకమానదు. ఇలాంటి అనుమానం కలగడం సహజం కూడా.
కాని దివ్యాంగుల విషయంలో అలాంటి పరిస్థితి లేదు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా దివ్యాంగులు కూడా అందరి మాదిరిగానే సునాయసంగా లైసెన్సు పొందవచ్చని అంటున్నారు రవాణా శాఖ అధికారులు. అదే సమయంలో కొన్ని షరతులు కూడా వర్తిస్తాయంటున్నారు. ఎవరైన దివ్యాంగులు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే నిశ్చింతగా కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఎవరైన దివ్యాంగులు తమ అవసరాల రీత్య కొనుగోలు చేసిన వాహానాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారికి లైఫ్ టాక్స్ కూడా మినహాయింపు ఉంది. సదరు వాహానం కొనుగోలు కోసం ముందుగా రవాణా శాఖ కార్యాలయం నుండి డీలర్ కు ఓ లేఖను పొందాల్సి ఉంటుంది. అయితే దివ్యాంగులకు ఎట్టి పరిస్థితిలోనూ ట్రాన్స్ పోర్టు వాహనాలను నడిపేందుకు మాత్రం లైసెన్స్ జారీ చేయరు. వారి కోసం తీసుకున్న ప్రత్యేక సౌకర్యాలతో కూడిన వాహనానికి మాత్రమేఈ లైసెన్స్ వర్తిస్తుంది.
దివ్యాంగుల అవసరాన్ని బట్టి వాహనాన్ని డిజైన్ చేసుకునే వీలుంది. అలాగే దివ్యాంగులు తమ అవసరాన్ని బట్టి వాహానానికి అవసరమైన మార్పులు చేర్పులు కూడా చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. అది పూర్తిగా దివ్యాంగుల కోసం మాత్రమే. ఒకవేళ దివ్యాంగులు ఏదైన ప్రభుత్వ పథకం కింద వాహానాన్ని పొంది దాని ద్వారా ఉపాధి పొందాలనుకుంటే మాత్రం దానికి తప్పని సరిగా ప్రత్యేక డ్రైవర్ ను ఏర్పాటు చేసుకోవాలి తప్ప తనే స్వయంగా ఆ వాహానాన్ని నడపటానికి వీలు లేదని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దివ్యాంగులు వారి కోసం తీసుకున్న ప్రత్యేక వాహానాన్ని వారు మాత్రమే నడుపుకునేందుకు వీలుగా లైసెన్స్ జారీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
లైసెన్స్ పొందిన దివ్యాంగులు ఏ ఇతర వాహానాన్ని నడపటానికి వీలు లేదు. కేవలం వారి కోసం డిజైన్ చేసిన వాహనాన్ని, వారు మాత్రమే నడుపుకునేందుకు మాత్రమే ఈ లైసెన్స్ వర్తిస్తుందని అధికారులు నొక్కిచెబుతున్నారు. ప్రత్యేక అవసరాల దృష్ట్యా పొందుతున్న డ్రైవింగ్ లైసెన్స్ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.