హైదరాబాద్ లో భూ ప్రకంపనలు.. ఆ ప్రాంతాల్లో భయం.. భయం

వర్షాలు, వరదలతో పుట్టెడు కష్టాల్లో ఉన్న హైదరాబాద్ మహానగరవాసులను మరో భయం వెంటాడుతోంది. పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్‌, వైదేహి నగర్‌ తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు.

news18-telugu
Updated: October 22, 2020, 10:19 AM IST
హైదరాబాద్ లో భూ ప్రకంపనలు.. ఆ ప్రాంతాల్లో భయం.. భయం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
వర్షాలు, వరదలతో పుట్టెడు కష్టాల్లో ఉన్న హైదరాబాద్ మహానగరవాసులను మరో భయం వెంటాడుతోంది. పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్‌, వైదేహి నగర్‌ తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఒక సెకండ్‌ పాటు భూమి కంపించడంతో శబ్ధాలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరిగెత్తారు. ఉదయం 5.40 గంటలకు ఒక సారి, మళ్లీ 6.45 గంటలకు మరోసారి వైదేహీనగర్‌లో భారీ శబ్ధంతో భూమి కంపించింది. అయితే 7.08 గంటలకు మూడోసారి భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.

ఇలా వరుసగా మూడుసార్లు భూమి కంపించడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వారం రోజుల కిందట హైదరాబాద్ లోని గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. భూమి లోపలి నుంచి కూడా శబ్ధాలు వచ్చాయని ప్రజలు భయం వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో వచ్చిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 0.5 నుంచి 0.8 మధ్య ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. బీఎన్‌రెడ్డి నగర్‌ ప్రాంతంలో భూమి కంపించిన ప్రాంతంలో ఇంతకుముందు ఎనరాళ్లు ఉండేవని స్థానికులు చెబుతున్నారు.

భారీగా శబ్దాలు వచ్చాయన్న సమాచారంతో NGRI అధికారులు ఇటీవల బోరబండలోని పలు కాలనీల్లో పర్యటించారు. భూకంప తీవ్రతను కొలిచేందుకు మూడు ప్రాంతాల్లో సిస్మోగ్రాఫ్ పరికరాలను ఏర్పాటు చేశారు. అక్టోబరు 2న వచ్చిన ప్రకంపనల 1.4 తీవ్రత ఉండగా.. అక్టోబర్ 4న 0.8 తీవ్రత నమోదయింది. తీవ్రత చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. బోరబండ ప్రాంతం ఎత్తైన గుట్టల ప్రాంతంలో ఉండడంతో భూమి లోపలి పొరల్లో ఏర్పడే సర్దుబాట్ల కారణంగానే శబ్దాలు వస్తున్నట్లు తెలిపారు. ఈమధ్య పడిన వర్షాల వల్ల వాన నీరు భూమిలోకి వెళ్తోందనీ... ఆ సమయంలో భూమి పొరల్లో ఉండే గాలి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుందని వారు వెల్లడించారు.
Published by: Nikhil Kumar S
First published: October 22, 2020, 10:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading