Home /News /telangana /

EARTHQUAKE OF MAGNITUDE 4 ON THE RICHTER SCALE OCCURRED 45 KM NORTH EAST OF KARIMNAGAR SK

Karimnagar Earthquake: కరీంనగర్‌లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

కరీంనగర్‌లో భూకంపం (Image:NCS)

కరీంనగర్‌లో భూకంపం (Image:NCS)

Karimnagar earthquake: రామగుండానికి పశ్చిమ నైరుతి దిశగా 8 కి.మీ దూరంలో.. కరీంనగర్ పట్టణానికి ఈశాన్య దిశగా 45 కి.మీ దూరంలో.. భూమికి 20 కి.మీ. లోతున.. భూకంప కంద్రం ఉన్నట్లు పేర్కొంది.

    తెలంగాణలో శనివారం మధ్యాహ్నం పలు చోట్ల భూప్రకంపనలు నమోదయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ సెస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4గా ఉన్నట్లు వెల్లడించింది. రామగుండానికి పశ్చిమ నైరుతి దిశగా 8 కి.మీ దూరంలో.. కరీంనగర్ పట్టణానికి ఈశాన్య దిశగా 45 కి.మీ దూరంలో.. భూమికి 20 కి.మీ. లోతున.. భూకంప కంద్రం ఉన్నట్లు పేర్కొంది. దాదాపు 2 సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం వణికిపోయారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.






    శ్రీశ్రీనగర్, చున్నంబట్టివాడ, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్ గ్రామాల్లో భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఐతే భూకంప తీవ్రత 4 మాత్రమే ఉందని.. అంటే చాలా తక్కువ తీవ్రత కలిగిన భూకంపమని అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Earth quake, Karimnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు