ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి మరియు జగిత్యాల జిల్లాల్లో స్వల్పంగా కంపించింది. దీంతో ఇళ్ల నుండి ప్రజలు పరుగులు తీశారు. ఈ సుమారు మూడు నాలుగు సెకన్ల పాటు సాయంత్రం భూమి కంపించినట్టు తెలుస్తోంది.
పెద్దపల్లి జిల్లాలో సాయంత్రం కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది. దీంతో స్థానిక ప్రజలకు రోడ్ల పైకి పరుగులు తీసినట్టు తెలుస్తోంది. జిల్లాలోని ముత్తారం, పెద్దపల్లి మండలంలోని హరిపురం, కేశనపల్లి, దర్యాపూర్ ,గోదావరి ఖనిలోని మార్కండేయ కాలనీ ఆశోక్ నగర్, గాంధినగర్, పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి, పాలకుర్తి, గ్రామాలతోపాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టు తెలుస్తోంది.
ఇది చదవండి : తెలంగాణలో తొలిసారి.. ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోబోతున్నారు.. వివరాల్లోకి వెళ్తే..
మరోవైపు జగిత్యాల జిల్లాలో కూడా భూమి కంపించింది. జిల్లా కేంద్రంలోని మూడవ వార్డులో ఈ ప్రకంపనలు కొనసాగాయి. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా మందమర్రి, ఆసిఫాబాద్, వేమనపల్లి, లో కూడా ప్రకంపనలు చెలరేగాయి. అయితే ఎక్కడ ఎలాంటీ అవాంచనీయమైన సంఘటనలు జరగలేదని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earth quake, Jagityala, Telangana