మునుగోడు (Munugodu) బైపోల్ హీట్ రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటివరకు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ మధ్య మాత్రమే తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి బరిలోకి దిగారు. ఇక కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతికి అధిష్టానం టికెట్ కేటాయించింది. మిగతా పార్టీలు అభ్యర్థులను ఎప్పుడో ఖరారు చేయగా..టిఆర్ఎస్ TRS మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. చివరకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కన్ ఫర్మ్ చేస్తూ సీఎం కేసీఆర్ బీ ఫారం కూడా అందజేశారు.
Big Breaking: వీఆర్ఏల చర్చలు సఫలం..సమ్మె విరమణ.. రేపటి నుంచి డ్యూటీలోకి..
ఇక మునుగోడులో (Munugodu) బీసీ ఓటర్లు అధికం. కానీ దానికి భిన్నంగా అభ్యర్థుల ఎంపికలో రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ , టిఆర్ఎస్ బీసీ అభ్యర్థులు ఉన్నారు. కానీ పార్టీ అధిష్టానం రెడ్డిలకు మొగ్గు చూపారు. ఇక రాజగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా బీసీల నుండి ఎవరూ పోటీలో లేరు. అయితే అన్ని పార్టీలు కుల సంఘాల ఓట్లపై దృష్టి సారించాయి. ముఖ్యంగా బీజేపీ (Bjp) అందుకోసం ఏకంగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ను రంగంలోకి దింపారు. ఆయన యాదవ సంఘాలతో సమావేశమై కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, దళితబంధు, ధరణి పోర్టల్, గొర్రెల పంపిణీ వంటి పథకాలపై ప్రశ్నించారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ కురుమ సామాజిక వర్గానికి అన్యాయం చేశారని అన్నారు. మునుగోడు (Munugodu) ఉపఎన్నికలో తమ మద్దతు బీజేపీకే తెలుపుతున్నట్టు ప్రకటించారు. రెండో విడత పంపిణీ కేవలం మునుగోడు వారికే కేటాయించడంలో అర్ధం ఏంటని ప్రశ్నించారు.
మునుగోడులో మొత్తం ఓటర్ల సంఖ్య= 2 లక్షల 27 వేల 101
ఇందులో
ఎస్సీలు- 35,411 (15.6 శాతం)
ఓసీలు- 20,290 (8.9 శాతం)
ఎస్టీలు- 13,000 5.(7 శాతం)
మైనార్టీలు- 8000 (3.5 శాతం)
బీసీల్లో
గౌడ: 38,000
గొల్ల కురుమ: 35,000
ముదిరాజ్: 34,500
పద్మశాలి: 19,000
వడ్డెర: 8,300
విశ్వబ్రాహ్మణ: 7,800
కుమ్మరి: 7,800
మరి ఎన్నికల్లో ఓటరు నాడి ఎలా వుండబోతుందో చూడాలి.
మరోవైపు మునుగోడు (Munugodu) ప్రజలు రాజకీయ పార్టీల సౌండ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. ఓటరు దగ్గర నుంచి సామాన్య వ్యాపారులు, మాంసం వ్యాపారులు, ఇళ్లు అద్దెకు ఇచ్చే వాళ్లు కూడా తెలివిగా ఈ ఉపఎన్నికల సీజన్‌ని సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికలకు మరో నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో అన్నీ పార్టీల నేతలు వారి అనుచరులు ప్రచారం చేసేందుకు మునుగోడులో వాలిపోయారు. ఒక్కసారిగా వచ్చిన చుట్టాలకు షెల్టర్లు లేకపోవడంతో స్థానికంగా ఉన్న అద్దె ఇళ్లను కిరాయికి తీసుకొని ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇల్లు తక్కువగా ఉండటం నేతలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో మునుగోడు నియోజకవర్గంలో సింగిల్ బెడ్రూం ఇల్లు నెలకు 30 వేలు, డబల్ బెడ్రూం ఇల్లు 75 వేలకుపైగా అద్దె వసూలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugodu, Munugodu By Election