Home /News /telangana /

E PASS MUST TO TRAVEL IN EMERGENCY PURPOSE IN LOCKDOWN OF TELANGANA VRY

E-pass : హైదరాబాద్‌లో కమిషనరేట్‌ పరిధి దాటలన్నా ఇది కావాల్సిందే...పాస్‌ల కోసం ఇక్కడ అప్లై చేయండి

డీజీపీ మహేందర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

డీజీపీ మహేందర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Lockdown :రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి పదిరోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వేరే రాష్ట్రాలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లాలన్నా.. పాసులను తప్పనిసరి చేశారు రాష్ట్ర పోలీసులు.

లాక్‌డౌన్ మరోసారి సామాన్య ప్రజానికానికి పరీక్ష పట్టింది. నిత్యవసరాల మేరకు నాలుగు గంటల సమయాన్ని సడలించింది. అయితే అత్యవసరాల మేరకు మాత్రం పాసులు తీసుకుని బయటకు వెళ్లాల్సిందే..ఇందుకోసం రాష్ట్ర పోలీసు శాఖ పాసులు ప్రవేశ పెట్టింది. ఎమర్జేన్సి పనుల మీద వెళ్లాల్సిన వారు ఈ పాస్‌లను కోసం ధరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.

ఇందుకోసం ఏవరు ఎక్కడ పాసులు తీసుకోవాలనే అంశాలపై డీజీపి వివరాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాలనుకునే వారు, ఇతర అవసరాల కోసం బయటకు వచ్చే వారు పాసులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అయితే ఈ పాస్‌లను జారీ చేసే అధికారం జిల్లా స్థాయిలో ఎస్పీలకు మరియు కమీషనరేట్ పరిధిలో కమిషనర్‌లకు మాత్రమే ఉంది.

కాగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు, లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారు స్థానిక జిల్లా ఎస్పీలు లేదా కమీషనర్‌ల నుండి పాస్‌లు పోందాలనుకునే వారు https://www.tspolice.gov.in/ వెబ్‌ద్వారా అప్లై చేసుకోవాలి. ఇక ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు రావాలనుకునే వారు ఆయా రాష్ట్రాల పోలీసు అధికారులు జారీ చేసిన పాసులు ఉంటేనే అనుమతి ఇస్తామని తెలిపారు.

మరోవైపు హైదారబాద్‌‌లో సైతం ఒక కమీషనరేట్ పరిధి నుండి మరో కమీషనరేట్ పరిధిలోకి రావాలన్న పాసులు తప్పని సరి చేసింది.దీంతో సైబారాబాద్, హైదారాబాద్, రాచకొండ పరిధిలోని కమీషనర్లు హైదారాబాద్ వాసులకు పాసులు జారీ చేయనున్నారు.

ఇక లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం ఆరు గంటలనుండి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏ విధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎక్కడినుండైనా వెబ్ సైట్ ద్వారానే ఈ-పాస్ కొరకై దరకాస్తు చేసుకోవాలని తెలిపారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Lockdown, Telangana, Telangana Police

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు