Home /News /telangana /

E CAR RACING IN HYDERABAD MOU BETWEEN TELANGANA STATE AND TEAM VRY

Hyderabad : హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ కార్ రేసింగ్ .. కుదిరిన ఒప్పందం.. పోటీలు ఎక్కడంటే...

హైదారాబాద్ లో ఈ కార్ రేసింగ్

హైదారాబాద్ లో ఈ కార్ రేసింగ్

Hyderabad : హైదరాబాద్‌లో ఈ కార్ రేసింగ్‌కు ఒప్పందం కుదిరింది. మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ టీమ్‌తో అవగాహాన ఒప్పందం చేసుకున్నారు. దీంతో రానున్న కొద్దిరోజుల్లో సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హుస్సెస్ సాగర్ చుట్టూ ఈ రేసింగ్ కోర్టు అందుబాటులోకి రానుంది.

ఇంకా చదవండి ...
    హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఫార్ములా వన్ ఈ రేసింగ్ పోటీలకు వేదిక కానుంది. ఇందుకు సంబంధించి ఈ రేసింగ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం అవగహాన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే నగరంలోని రానున్న కొద్ది రోజుల్లో సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హుస్సెస్ సాగర్ చుట్టూ సుమారు 2.37 కిలోమీటర్ల మేర రేసింగ్ కోర్టు అందుబాటులోకి రానుంది.

    ఈ ఒప్పందంతో ఈ ఘనత సాధించిన ప్రపంచ స్థాయి మహానగరాలైన న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్ వంటి ఎలైట్ క్లబ్ లిస్టులో హైదరాబాద్ కూడా చేరింది. ఈమేరకు “ఫార్ములా ఈ” సంస్థకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికీ, గ్రీన్ కో అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగింది. అత్యంత పర్యావరణ హితమైన కార్లతో నిర్వహించే ఈ “ఫార్ములా ఈ” రేసింగ్ ను “ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్” అనే సంస్థ ప్రతి ఏడాది ఒక్కో నగరంలో నిర్వహిస్తుంది.

    Cabinet meeting : కేబినెట్ సమావేశం.. నైట్ కర్ఫ్యూ, ఆంక్షలపై కీలక నిర్ణయాలు..

    ఇక సాంప్రదాయకంగా నిర్వహించే ఫార్ములా వన్ కార్ రేసింగ్ ల వలే..ఫార్ములా ఈ కార్ రేస్ కోసం ప్రత్యేకంగా “రేస్ ట్రాక్” ఏర్పాటు చేయనవసరంలేదు. ఇందుకోసం నగరంలో ఉండే సాధారణ రోడ్లపైనే ఎలక్ట్రికల్ కార్ రేస్ నిర్వహిస్తారు. కాగా ఇందుకోసం అనేక రాష్ట్రాలు పోటి పడ్డప్పటికి ఈ రేసింగ్ టీమ్ హైదరాబాద్ వైపు మొగ్గు చూపింది. దీంతో దేశంలోని ఇతర నగరాలైన ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి రాష్ట్రాలు ముందుకు వచ్చిన హైదరాబాద్ ఆతిథ్యానికి వేదికైంది,.

    ఇక ఈ ఒప్పందాలకు సంబంధించి ఇప్పటికే రేసులు నిర్వహించే కమిటి హైదరాబాద్ నగరాన్ని సంధర్శించింది. నగరంలోని ట్యాంకుబండ్, నెక్లెస్ రోడ్, KBR పార్క్, జూబిలీహిల్స్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. కాగా వీటిలో ట్యాంకుబండు ప్రాంతాన్ని కమిటి ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే నేడు త్రైపాక్షిక ఒప్పందం ఖరారు అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందించే ఈ ప్రాజెక్టులో.. రేస్ నిర్వాహకుల సూచనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా నిర్ణయించిన ప్రాంతాల్లో రోడ్లను విస్తరించి, ఇరువైపులా ప్రేక్షకుల కోసం అక్కడక్కడా స్టాండ్స్ కూడా ఏర్పాటు చేయాలి.

    Kothagudem : అధికార పార్టీ నేతలను ఊరిస్తున్న ఆ సీటు.. వీళ్లకు ఫుల్‌స్టాప్ పడ్డట్టేనా...?

    కాగా ఈ ఒప్పందం సంధర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఎలక్ట్రిక్ వాహనాలు మరింత పెరగాలని, గ్రీన్ ఎనర్జీ దిశగా ప్రయత్నాలు ముమ్మరం కావాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ఇక హైదరాబాద్‌లో సైతం గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఈవీ సెంటర్లను సైతం హైదరాబాద్‌లోని సీతారాంపూర్, దివిటీపల్లిలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, KTR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు