Home /News /telangana /

DUPLICATE TEA POWDER SCAM RUNNING IN MEDAK AREA SINCE YEARS AND OFFICIALS MAINTAINING SILENCE MDK PRV

Medak: మెదక్​ పరిధిలోనే నకిలీ టీ పౌడర్​ దందా.. ఇష్టమొచ్చిన రంగులు కలుపుతూ తయారు చేస్తున్న వైనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉదయం లేవగానే ఛాయ్ కావలి అంటారు . ఆ చాయ్ పత్తి  నకిలీ ఛాయ్ పత్తి అని తెలియదు . ఈ ఛాయ్ పత్తి కారణంగా ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఈ నకిలీ టీ పౌడర్​ మెదక్​ పరిసర ప్రాంతాల్లోనే తయారు చేస్తుండటం గమనార్హం.

    (News 18 ప్రతినిధి కె.వీరన్నమెదక్ జిల్లా)

    ఉదయం లేవగానే ఛాయ్ కావలి అంటారు . ఆ చాయ్ పత్తి  నకిలీ ఛాయ్ పత్తి అని తెలియదు . ఈ ఛాయ్ పత్తి కారణంగా ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఈ నకిలీ టీ పౌడర్ (Duplicate Tea powder)​ మెదక్​ పరిసర ప్రాంతాల్లోనే తయారు చేస్తుండటం గమనార్హం.  రాళ్లతో టీ పౌడర్ తయారు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా మెదక్​ (medak) కేంద్రానికి కిలోమీటర్ దూరంలో టీ పౌడర్ (Tea powder) దందా జోరుగా కొనసాగిస్తున్నారు. కొండాపూర్ మండలం లో ని మల్కాపుర్ శివారు లో గుట్టు చప్పుడు కాకుండా గత నాలుగేళ్లుగా నకిలీ టీ పొడి తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇష్టమొచ్చిన రంగుల‌ను క‌లుపుతూ ప్ర‌జ‌ల‌కు హాని క‌లిగించే టీ పొడిని త‌యారు చేస్తున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే అన్నీ తెలిసిన అధికారులు (Officials) మాత్రం తతంగాన్ని చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.

    ఇది కూడా చదవండి: మద్యం తాగిన భర్త కిడ్నాప్​.. భర్త ప్రాణాల కోసం మానాన్ని పణంగా పెట్టిన ఇల్లాలు.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..

    గోదాంకు తాళాలు వేసి ఎవరికి కనపడకుండా..

    సంగారెడ్డి (sangareddy) జిల్లా మాల్క పుర్ లో ఓ వ్యాపారస్తుడు (సుదర్శన్ ) ఈజీ మనీకి అలవాటు పడి ఇతర రాష్ట్రాల నుంచి టీ పౌడర్ తెప్పిస్తూ ఒక గోదాం ఏర్పాటు చేసి నలుగురు వర్కర్లతో  టీ పౌడర్ ని ఇతర టీ బ్రాండ్ (Tea Brand) పేర్లతో ఉన్న వాటిని కలిపి మిశ్రమం చేస్తూ దందా  మొదలు పెట్టాడు . గోదాంకు తాళాలు వేసి ఎవరికి కనపడకుండా తయారు చేస్తున్నారు.  ఈ టీ పౌడర్​ని కర్ణాటక మహారాష్ట్ర తోపాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి: అయ్యో ఎంత పని చేశావమ్మా... డాక్టర్​ చెప్పాడని నిండు గర్భిణి అయి ఉండి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నావా..? 

    పలువురు ఫిర్యాదు చేయడంతో..

    అయితే గోదాంపై అనుమానంతో పలువురు ఫిర్యాదు చేయడంతో ఫుడ్ ఆఫీసర్స్​ వెళ్లి తనిఖీలు చేపట్టి శాంపిల్స్​ సేకరించి హైదరాబాద్ ఫుడ్​ ల్యా బ్ కు పంపించారు. వాటిపై ఫలితాలు వచ్చే వరకు గోదాం తీయవద్ద ని ఆదేశాలు జారీ చేశారు. కానీ సదరు వక్తి రూల్స్ బ్రేక్ చేసి యథావిధిగా దందా కొనసాగిస్తుండటం గమనార్హం.

    ఇక్కడి సరుకే జహీరాబాద్, బుదేర, నారాయణ్ ఖేడ్, చేవెళ్ల, శంకర్ పల్లి, తదితర ప్రాంతాలకు  వెళ్తుంది. ఇంత దర్జాగా వ్యాపారం చేస్తున్నాడంటే వీరి వెనుక పెద్ద ఎత్తున బడాబాబుల అండ దండ ఉందని అర్థం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, సంబంధిత జిల్లాఅధికారి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

    ఇవి కూడా చదవండి : రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

    ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Medak, Tea

    తదుపరి వార్తలు