• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • DUE TO SUMMER EFFECT FULL DEMAND FOR POOR PEOPLE REFRIGERATOR ADILABAD POTS IN TELANGANA ADB SRD

Telangana : పేదవాడి రిఫ్రిజిరేటర్లు ఈ రంజన్లు.. సమ్మర్ లో వీటికి ఫుల్ డిమాండ్..(వీడియో)

Telangana : పేదవాడి రిఫ్రిజిరేటర్లు ఈ రంజన్లు.. సమ్మర్ లో వీటికి ఫుల్ డిమాండ్..(వీడియో)

పేదవాడి రిఫ్రిజిరేటర్లు ఈ రంజన్లు.. సమ్మర్ లో వీటికి ఫుల్ డిమాండ్..

Telangana : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం పూట కాస్త చల్లని నీటి కోసం తహతహలాడే రోజులు వచ్చాయి. ధనికులు తమ ఇళ్లలోని ఫ్రిజ్ ల ద్వారా దాహార్తి తీర్చుకుంటే, పేదోడు రంజన్లలోని చల్లని నీటితో దాహార్తి తీర్చుకుంటున్నాడు.

  • Share this:
    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం పూట కాస్త చల్లని నీటి కోసం తహతహలాడే రోజులు వచ్చాయి. ధనికులు తమ ఇళ్లలోని ఫ్రిజ్ ల ద్వారా దాహార్తి తీర్చుకుంటే, పేదోడు రంజన్లలోని చల్లని నీటితో దాహార్తి తీర్చుకుంటున్నాడు. అందుకే ఈ రంజన్లను పేదవాడి రిఫ్రిజిరేటర్ గా చెప్పుకుంటున్నారు. ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు ఏ జిల్లా వాసులకైన గుర్తుకువచ్చేవి ఆదిలాబాద్ రంజన్లు. పేదవాడి రిఫ్రిజిరేటర్ గా చెప్పుకునే ఈ రంజన్లకు ఆదిలాబాద్ పెట్టింది పేరు. నీటిని చల్లగా రుచికరంగా చేయడంతో పాటు అందంగా ఉండడం వల్ల వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. మట్టి చల్లదనాన్ని ఇస్తుండటంతో ఇక్కడ తయారైన రంజన్లు తెలుగు రాష్ట్రలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర లోని పలు ప్రాంతాల వారు ప్రతి వేసవిలో ప్రత్యేకంగా దిగుమతి చేసుకుంటారు. ఈ రంజన్ల తయారీ గురించి, వాటిని వాడుతున్న చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడి కుమ్మరి వారు రంజన్ల తయారీలో ఉపయోగించే మట్టి సేకరణ నుంచే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. నాణ్యత కలిగిన బంకమట్టిని సేకరించి పొడిగా కలుపుతారు. నీళ్లతో తడిపిన ఆ మిశ్రమాన్ని అలాగే కొద్ది రోజుల పాటు ఉంచుతారు. గుర్రపు లద్ది కలిపిన తర్వాత రంజన్లను చేతితో తయారు చేసి ఆరబెడతారు. అలా ఓ క్రమపద్దతిలో పేర్చి మంటల్లో కాలుస్తారు.

    కాల్చిన తర్వాత ఏర్పడే రంధ్రాల నుంచి నీరు బయటకు రానప్పటికీ వాటి గుండా గాలి తగలడంతోనే అతి తక్కువ సమయంలో వాటిలోని నీరు చల్లగా మారుతుంది. రంజన్ లో నీరు నింపితే చాలు గంటలోపే చల్లగా అయిపోతాయి. వేసవి వచ్చిందంటే రంజన్ ను కొనుక్కొని చల్లని నీరు తాగుతారు. ఈ రంజన్లకు ఎండాకాలంలో మాత్రం బాగా గిరాకి ఉంటుంది. అయితే ఎండాకాలం రాకముందే గుర్రపు లద్దేను మహారాష్ట్ర నుండి తెచ్చుకొని, మట్టిలో కలిపి రంజన్లు తయారు చేస్తామని, తమ కుటుంబమంతా ఈ వృత్తికే శ్రమను ధారాపోసినామిగిలేది తక్కువేనని వాపోతున్నారు రంజన్ల తయారీదారులు.

    ప్రభుత్వం సహాయం అందిస్తే రాబోయే రోజుల్లో కుల వృత్తిని కొనసాగిస్తామని రంజన్ల తయారీదారులు అంటున్నారు. ఇప్పటికే చాలా మంది గిట్టుబాటు లేక కుమ్మరి వృత్తిని వదిలేశారని పేర్కొంటున్నారు. ప్రభుత్వం రంజన్ల తయారిని కుటీర పరిశ్రమగా గుర్తించి, ముడిసరుకు తక్కువ ధరకు అందించాలని, ఆర్థిక సహయం చేసి రంజన్ల విక్రయానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: