హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ బస్సులు బంద్... మెట్రోపై ప్రజల ఆధారం

ఆర్టీసీ బస్సులు బంద్... మెట్రోపై ప్రజల ఆధారం

అయితే సీఎం కేసీఆర్ ఆర్టీసీపై రివ్యూ సమావేశంలో ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించిన విషయం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ నిజంగానే అలాంటి ఆలోచనలో ఉన్నారా ? లేక ఆర్టీసీ నష్టాలు తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారా అన్నది ఆసక్తిరేపుతోంది.

అయితే సీఎం కేసీఆర్ ఆర్టీసీపై రివ్యూ సమావేశంలో ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించిన విషయం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ నిజంగానే అలాంటి ఆలోచనలో ఉన్నారా ? లేక ఆర్టీసీ నష్టాలు తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారా అన్నది ఆసక్తిరేపుతోంది.

TSRTC Strike : తెలంగాణలో సమ్మె వల్ల ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో... ప్రజలు మెట్రో రైళ్లు, ప్రత్యామ్నాయాలను అనుసరిస్తున్నారు.

ప్రభుత్వ హెచ్చరికలు పనిచెయ్యలేదు. ఆర్టీసీ ఉద్యోగులు దిగిరాలేదు. ముందే చెప్పినట్లుగా ఇవాళ సమ్మెకు దిగారు. ఫలితంగా తెలంగాణలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఐతే... ప్రజలు కూడా ముందుగానే సిద్ధమయ్యారు. ప్రత్నామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. వీటిలో ప్రధానంగా మెట్రో రైళ్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. ప్రతీ 3 నిమిషాలకు ఓ మెట్రో రైలు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో... ప్రజలు ఇవాళ మెట్రో రైళ్లను అనుసరిస్తున్నారు. ఆలాగే ఆటోలు, మినీ వ్యాన్‌లు, స్కూల్ బస్సుల వంటివి కూడా ప్రయాణికుల్ని తీసుకెళ్తున్నాయి. అవి ఎంతలా తీసుకెళ్తున్నా... ఆర్టీసీ బస్సులు లేకపోవడాన్ని... అవి పూర్తిగా భర్తీ చేయలేని పరిస్థితి. ఐతే... దసరా సెలవుల కారణంగా ఇప్పటికే చాలా మంది హైదరాబాద్ నుంచీ సొంత ఊళ్లకు వెళ్లిపోవడం కొంతవరకూ ఉపశమనం అనుకోవచ్చు.

సీఎం కేసీఆర్ సీరియస్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల లోపు ఆయా ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆ సమయంలోగా విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

ఇకపై కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు రవాణా మంత్రి అజయ్. దీంతో కార్మికులతో చర్చల కోసం నియమించిన సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీ కూడా రద్దయిపోయింది. ట్రాన్స్ పోర్టు కమిషనర్‌గా సందీప్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని, క్రమశిక్షణ కాపాడాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు.

ప్రత్యామ్నాయ సదుపాయాలు : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆర్టీసీలో పదివేల బస్సులు నడుస్తున్నాయని, ఇందులో 2100 బస్సులు ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులని సీఎం కేసీఆర్‌కి అధికారులు చెప్పారు. మరో ఐదు వేల మంది తాత్కాలిక డ్రైవర్లుగా చేయడానికి ముందుకు వచ్చారన్నారు. దీంతో 7వేలకు పైగా బస్సులు నడపడం సాధ్యమతుందని చెప్పారు. ఆర్టీసీలో మైలేజ్ అయిపోయిన 2,600 బస్సుల స్థానంలో అద్దె బస్సులు తీసుకోవాలని, శనివారమే ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికిప్పుడు ప్రజల అసౌకర్యాన్ని వీలయినంత తగ్గించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు తెప్పించాలని, రాష్ట్రంలోని ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు వాహనాల ఆపరేషన్లపై కాస్త ఉదారంగా ఉండాలని చెప్పారు. ప్రైవేటు వాహనాలకిచ్చే పర్మిట్ రుసుంలో 25 శాతం రాయితీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. సరిహద్దులో ఉన్న జిల్లాలకు దాని సరిహద్దులో ఉన్న రాష్ట్రాల నుంచి ప్రైవేటు బస్సులను తెప్పించాలని ఆదేశించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వహించే ఉద్యోగులు, కార్మికులకు తగిన భద్రత కల్పించాలని డిజిపిని సిఎం ఆదేశించారు. బస్సు డిపోల వద్ద భద్రత కల్పించాలని, బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సిఎం కోరారు.

Published by:Krishna Kumar N
First published:

Tags: CM KCR, Hyderabad Metro, Tsrtc

ఉత్తమ కథలు