హైదరాబాద్ (Hyderabad) నగరంలో కొద్దిరోజులుగా డెంగీ జ్వరాలు (Dengue fever) పెరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు నిర్లక్ష్యం వీడట్లేదు. జిల్లా మలేరియా అధికారుల లెక్కలకు, జీహెచ్‌ఎంసీలోని (GHMC) ఎంటమాలజీ విభాగం గణాంకాలకు పొంతన ఉండట్లేదు. ఫలితంగా.. ఒక ఇంట్లో.. ఒకరితో మొదలైన డెంగీ జ్వరం.. ఇంట్లోని అందరినీ తాకుతోంది. గతేడాది జులై నెలాఖరు వరకు 130 డెంగీ కేసులు నమోదవగా, ఈ ఏడాది ఇప్పటికే 596 కేసులు (Dengue cases) నమోదయ్యాయి.
గతేడాదిలో మొత్తం 1559 కేసులు (Dengue cases) నమోదవగా, ఈ ఏడాది ఆ సంఖ్య మూడు రెట్లకుపైగా ఉండొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఫాగింగ్ కోసం 18 యూనిట్లు పని చేస్తున్నాయి. ఒక్కో యూనిట్‌లో 19 మంది ఉంటారు. అందులో ఒకరు సూపర్‌వైజరు. దోమల మందును పిచికారి చేసే బృందాలు 107 ఉన్నాయి. ఒక్కో బృందంలో 19 మంది ఉంటారు. మొత్తంగా దోమల నివారణ విభాగంలో 2,500ల మంది సిబ్బంది ఉంటే.. అందులో సగం మంది కూడా రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఫాగింగ్ కోసం ఇచ్చే డీజిల్, పెట్రోలును కొందరు సిబ్బంది అమ్ముతుండగా, ఇంటింటికి తిరిగి మందు చల్లాల్సిన సిబ్బందేమో.. ఇంటి గోడపై సంతకాలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. పైగా.. ఉన్న అరకొర సిబ్బందిని కేంద్ర కార్యాలయం ఇతర అవసరాలకు మళ్లించింది. రెండు పడక గదుల ఇళ్ల దరఖాస్తుల పరిశీలనకు దోమల విభాగం కార్మికులను ఉపయోగించుకుంటోంది.
ఇలా చేయండి..
మరోవైపు హైదరాబాద్ నగర ప్రజలు అందం, ఆహ్లాదం కోసం పెంచుతున్న పూల మొక్కలు.. వాటి కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలు ప్రస్తుతం డెంగీ దోమలకు నిలయంగా మారుతున్నాయి. కాగా, దోమలు ఎక్కువగా నిల్వ ఉండే ప్రదేశాలలో ఇంటి ఆవరణలోని పూల కుండీలు, మనీప్లాంట్స్, ఇతర చెట్ల పొదలు టైర్లు, ఖాళీ సీసాలు, కొబ్బరి బోండాలు ఇంటిపై మూతల్లేని నీటి ట్యాంకులు కొత్త నిర్మాణాలు, సెల్లార్లు తాళం వేసిన నివాసాలు విద్యా సంస్థలు, ఫంక్షన్ హాళ్లు ముంపు ప్రాంతాల్లో నిల్వ నీరు ఉన్న చోట ఉంటాయి. అందుకే అలాంటి వాటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగీ రాకుండా అరికట్టవచ్చు.
గతేడాది సంపన్నుల కాలనీల్లోనే..
గతేడాది సంపన్నులు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్(banjara hills) వంటి ప్రాంతాల్లో నమోదయ్యాయి పేద, మధ్య తరగతి(middle class) ప్రజలతో పోలిస్తే సంపన్నుల నివాసాలు విశాలంగా ఉంటాయి. వీరు ఇంటి ఆవరణలో అందం, ఆహ్లాదకర వాతావరణం కోసం మనీ ప్లాంట్లు, రకరకాల పూల మొక్కలు(flower plants) పెంచుకుంటారు. వీటి కోసం భారీ కుండీలను ఏర్పాటు చేస్తుంటారు. వర్షపు నీరు వీటిలో చేరి రోజుల తరబడి నిల్వ ఉంటుంది. వీటిలో డెంగీ దోమలు గుడ్లు(eggs) పెట్టి వాటి వృద్ధికి కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. కొత్త కాలనీలు, నిర్మాణాలు, సెల్లార్లు ఎక్కువగా ఉన్న శివారు ప్రాంత మున్సిపాలిటీల్లోనూ డెంగీ కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగించింది. ఆ సమయంలో అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి డెంగీ కేసులను అరికట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dengue fever, GHMC, Heavy Rains, Hyderabad