హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rain Alert: మూసీకి, ట్యాంక్‌బండ్‌కు దగ్గరగా ఉన్నారా..? బ్యాగులు సర్దుకోండి!

Rain Alert: మూసీకి, ట్యాంక్‌బండ్‌కు దగ్గరగా ఉన్నారా..? బ్యాగులు సర్దుకోండి!

Hyderabad floods

Hyderabad floods

నాలాల పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి ప్రమాద హెచ్చరిక జారీచేశారు అధికారులు. అనేక ప్రాంతాల్లో వర్షపునీరు, డ్రైనేజీ నీళ్లు గల్లీల్లో ప్రవహిస్తున్నాయి.

Rain Alert : బ్యాక్ టు బ్యాక్ వర్షాలు హైదరాబాద్ ను ముంచుతున్నాయి. నీళ్లలో మునిగిన ప్రాంతాలు ఇంకా తేరుకోకమందే మళ్లీ వరద పోటెత్తుతోంది. సోమవారం అర్ధరాత్రి ఓల్డ్ సిటీలో వాన దంచికొట్టింది. చాంద్రాయణ గుట్ట, చార్మినార్, బహదూర్ పురా, రాజేంద్రనగర్, ఫలక్ నుమా ఏరియాల్లో 9 సెంటీమీటర్ల వాన పడింది. దీంతో.. ఓల్డ్ సిటీలోని డ్రైనేజీల్లో వరద పొంగుతోంది. అన్ని నాలాల్లో వరద ప్రవాహం ఊహించనంత వేగంగా పైకి చేరి ప్రవహిస్తోంది.

హుస్సేన్ సాగర్ కు వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా తూముల ద్వారా మూసీలోకి వదులుతున్నారు అధికారులు. ఇవాళ, రేపు కూడా భారీవర్ష సూచన ఉండటంతో.. హుస్సేన్ సాగర్ దిగున నివాసమంటున్న వారు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉంటున్న వారిని హైఅలర్ట్ చేశారు అధికారులు. పీఠభూమి ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన షెల్టర్లు, అన్నవసతి కల్పిస్తున్నారు. వరద పెరిగితే.. ముంపు ప్రాంత బాధితులకు కనీస వసతి కల్పించి ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వరదపై అలర్ట్ గా ఉండాలని.. ఏ క్షణమైనా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్దంగా ఉండాలని అధికారులు మూసీ, నాలాల పరీవాహక ప్రాంతాల ప్రజలకు సూచించారు.

నాలాల పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి ప్రమాద హెచ్చరిక జారీచేశారు అధికారులు. అనేక ప్రాంతాల్లో వర్షపునీరు, డ్రైనేజీ నీళ్లు గల్లీల్లో ప్రవహిస్తున్నాయి. ఇళ్లలోకి మురుగు నీరు చేరి చాలామంది నరకయాతన అనుభవిస్తున్నారు.

రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ లాంటి సిటీ పరిసర ప్రాంతాల్లో కుండపోత కురిసింది. వికారాబాద్ లోనే గత అర్ధరాత్రి 13 సెంటీమీటర్ల వాన పడిందని అధికారులు చెప్పారు. దీంతో.. మూసీలో వరద ప్రవాహం భీకరంగా మారింది.

వికారాబాద్, శంకర్ పల్లి, అత్తాపూర్ ఏరియాల్లో వాన దంచికొట్టడంతో.. మూసీలో వరద ప్రవాహం డేంజర్ గా మారింది. తాండూరు-వికారాబాద్, పరిగి-వికారాబాద్ మధ్య రాకపోకలు కట్టయ్యాయి.

Read This : Hyderabad | Heavy rains:సైలెంట్‌గా కురిసిన వర్షానికి వణికిపోయిన ఓల్డ్ సిటీ ..ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు

హైదరాబాద్ మూసారాంబాగ్ వంతెన పైనుంచి ఫ్లడ్ వెళ్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూసారాంబాగ్- గోల్నాక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు.

Published by:V. Parameshawara Chary
First published:

Tags: Hyderabad Floods, HYDERABAD RAIN

ఉత్తమ కథలు