Home /News /telangana /

DUBBAKA MLA RAGHUNANDAN RAO APPROACHES HIGH COURT TO DISMISS FIR AGAINST HIM DURING BYPOLLS BA

హైకోర్టును ఆశ్రయించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

ఉప ఎన్నికల సమయంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

    దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఉప ఎన్నికల సమయంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో తన బంధువుల ఇళ్లలో రూ.18 లక్షలు దొరికాయని, అవి తనకు సంబంధించినవే అంటూ పోలీసులు, రెవిన్యూ అధికారులు కట్టుకథ అల్లారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు వచ్చింది. అయితే, ప్రజాప్రతినిధుల మీద నమోదైన క్రిమినల్ కేసులను చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని, కాబట్టి దీన్ని కూడా సీజేకు బదిలీ చేయాలని జస్టిస్ లక్ష్మణ్ సూచించారు.

    దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సిద్దిపేటలోని రఘునందన్‍ రావు మామ రాంగోపాల్‍ రావు మరో బంధువు అంజన్‍ రావు ఇళ్లలో పోలీసులు, రెవిన్యూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అంజన్‍ రావు ఇంట్లో అధికారులకు రూ.18.67 లక్షలు లభించాయని తెలిపారు. ఈ సమాచారం తెలియగానే బీజేపీ అభ్యర్థి రఘునందన్‍ రావు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున అంజన్‍ రావు ఇంటికి చేరుకొని పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారని, పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట కూడా జరిగిందని చెప్పారు.. ఈ తోపులాటలో రఘునందన్‍ రావు సొమ్మసిల్లి కిందపడిపోయారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదులో రూ.12 మొత్తాన్ని బీజేపీ శ్రేణులు లాక్కెళ్లాయని ఆ తర్వాత పోలీసులు చెప్పారు. అంజన్‍ రావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది.

    ఎన్నికల కోడ్‍ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన డబ్బులను సోదా చేసి పట్టుకున్నామని పోలీసులు చెబుతుండగా.. పోలీసులే డబ్బులు తెచ్చి పెట్టి సోదాల్లో దొరికాయని చెబుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. విమర్శలు ప్రతివిమర్శలు నినాదాలతో సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో దుబ్బాక ఉప ఎన్నికల వేడి మరింత రాజుకుంది. తమ అత్త గారి ఇంటిపక్కనే ఉన్న ఇంట్లో డబ్బులు దొరికితే తనకేం సంబంధమని రఘునందన్‍ రావు అన్నారు. దసరా సందర్భంగా తన భార్య కూతురు అత్తగారి ఇంటికి వెళ్లారని చెప్పారు.  అయితే, పోలీసులే డబ్బులు పెట్టారన్న ఆరోపణలను పోలీస్ కమిషనర్ ఖండించారు.

    మరోవైపు రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాస్‌ను ఎన్నికల సమయంలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హవాలా కేసులో కోటి రూపాయలు డబ్బు పట్టుకున్నామని, అందులో ఇద్దరినీ అరెస్టు చేశామని అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. ‘దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ బావమరిది సురభి శ్రీనివాస్ రావును అరెస్టు చేశాం. ఇతను చందా నగర్ కు చెందిన వ్యక్తి. మరో వ్యక్తి రవి కుమార్ (కార్ డ్రైవర్) మీద అరెస్ట్ చేసాం. ఇన్నోవా కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఫోన్ లో చాలా కీలక సమాచారం సేకరించాం. ఫోన్ కాల్ లిస్ట్ లో రఘునందన్ రావు కి నేరుగా శ్రీనివాస్ రావు ఫోన్ చేశాడు. రఘునందన్ రావు బావ మరిది శ్రీనివాస్ కు విశాఖ ఇండస్ట్రీ నుంచి కోటి రూపాయలు అందాయి. వాటిని హైదరాబాద్ మీదుగా దుబ్బాక తీసుకెళ్తున్నారు.’ అని అప్పట్లో అంజనీ కుమార్ తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Dubbaka By Elections 2020, Raghunandan rao, Telangana, Telangana High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు