హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka By Poll: దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల తేదీపై క్లారిటీ..ఎప్పుడంటే?

Dubbaka By Poll: దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల తేదీపై క్లారిటీ..ఎప్పుడంటే?

కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం

కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం

Dubbaka By Poll 2020 Date: తెలంగాణ(Telangana State)లో ఖాళీగా ఉన్న దుబ్బాక శాసనసభకు ఉప ఎన్నికల తేదీపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే అదే రాష్ట్రంలోని వాల్మీకి నగర్ లోక్‌సభ స్థానం, వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఇంకా చదవండి ...

  Dubbaka By Elections 2020 Update: తెలంగాణలో ఖాళీగా ఉన్న దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల తేదీపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. దీంతో దుబ్బాకలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే అదే రాష్ట్రంలోని వాల్మీకి నగర్ లోక్‌సభ స్థానం, వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించాలని శుక్రవారంనాటి సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఉప ఎన్నికలు జరిగే 64 అసెంబ్లీ స్థానాల్లో దుబ్బాక నియోజకవర్గం కూడా ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో ఆగస్టు 6న కన్నుమూయడంతో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఖాళీగా ఉన్న స్థానానికి ఉప ఎన్నికలను ఆరు మాసాల్లోపు ఈసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు జనవరి మాసం వరకు ఎన్నికల సంఘానికి గడువు ఉంది. అయితే కేంద్ర బలగాల తరలింపు, ఇతరత్ర కారణాలతో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపే దుబ్బాక నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.

  బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఖాళీగా ఉన్న స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను తగిన సమయంలో వెలువరిస్తామని ఈసీ తెలిపింది. నవంబరు 29వ తేదీ లోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఈసీ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

  ఉప ఎన్నికలు జరగనున్న 64 అసెంబ్లీ స్థానాల్లో..మధ్యప్రదేశ్‌లోనే 27 స్థానాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన 27 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. కరోనా, వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వాయిదాపడ్డాయి.

  Published by:Janardhan V
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Election Commission of India

  ఉత్తమ కథలు