• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • DUBBAKA BYPOLLS 2020 BABU MOHAN COMMENTS ON HARISH RAO DETAILS HERE MS KNR

Dubbaka Bypolls 2020: బండి సంజయ్ పై దాడి చర్య హేయమైనది.. హరీశ్ రావుపై బాబు మోహన్ ఫైర్

Dubbaka Bypolls 2020: బండి సంజయ్ పై దాడి చర్య హేయమైనది.. హరీశ్ రావుపై బాబు మోహన్ ఫైర్

దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లపై బాబుమోహన్ ధ్వజమెత్తారు. బండి సంజయ్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

  • News18
  • Last Updated:
  • Share this:
    తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి హేయమైన చర్య అని బీజేపీ నాయకుడు బాబు మోహన్ అన్నారు. సోమవారం సాయంత్రం పూట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై జరిగిన చర్యను హేయమైనదిగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావుపై ఆయన నిప్పులు చెరిగారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి ఖరారైందని బాబుమోహన్ అన్నారు. హరీశ్ రావే పోలీసులను ఉసిగొల్పి బండి సంజయ్ పై దాడికి పథకం రచించాడని ఆయన ఆరోపించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి ఖరారవడంతోనే హరీశ్ రావు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

    బాబుమోహన్ మాట్లాడుతూ.. హరీశ్ రావు చిన్న పిల్లాడిలాగా ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారని మండిపడ్డారు. సిద్ధిపేట, గజ్వేలులాగా దుబ్బాక ఎందుకు అభివృద్ధి చేయలేదు? అని ఆయన నిలదీశారు. హరీశ్ రావు ఓడిపోతేనే ఈ ప్రాంతం పచ్చగా ఉంటుందని ఆయన కామెంట్ చేశారు.

    బీజేపీ అభ్యర్థి  రఘునందన్ రావు గెలిస్తే దుబ్బాక అభివృద్ధి ఖాయం అని ఆయన తెలిపారు.ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ కల్లెర్రజేస్తే మీరు జైల్లో ఉంటారని టీఆర్ఎస్ నాయకత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఆడవాళ్లు, పిల్లలని చూడకుండా పోలీసులు అతిగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు.

    రాజకీయాలకతీతంగా.. హుందాగా ఉండాల్సిన సీపీ కూడా బీజేపీ నాయకత్వంపై అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు.నిన్నటి ఘటనపై చర్యలు తప్పవని బాబుమోహన్ హెచ్చరించారు. సిద్దిపేటలో బీజేపీకి ఎదురైన అనుభవమే.. భవిష్యత్తులో మీకు ఎదురవుతుందని టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. దుబ్బాకలో టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయని, రఘునందన్ రావు గెలుపు తథ్యమని ఢంకా భజాయంచారు. దుబ్బాకలో గెలవబోయేది బీజేపీయేనని బాబుమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో తర్వాతి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీదే గెలుపని ఆయన స్పష్టం చేశారు. దుబ్బాక నుంచి పలువురు యువకులు తనకు ఫోన్ చేసి.. టీఆర్ఎస్ ను ఓడిస్తామని తనతో శపథం చేశారని ఆయన అన్నారు.

    కాగా, సిద్ధిపేటలో పోలీసు అధికారుల సోదాల విషయం తెలుసుకుని దుబ్బాకకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఆ క్రమంలో బండి సంజయ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆయన గట్టిగా కేకలు పెట్టారు. ఆ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే సిద్ధిపేటలో సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ సమాధి దుబ్బాక నుండే మొదలవుతుందని ఆయన అన్న విషయం విదితమే.
    Published by:Srinivas Munigala
    First published: