హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka ByElection Result: దుబ్బాక ఓటమిపై కేటీఆర్ రియాక్షన్.. ఏమన్నారంటే..

Dubbaka ByElection Result: దుబ్బాక ఓటమిపై కేటీఆర్ రియాక్షన్.. ఏమన్నారంటే..

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

KTR on Dubbaka by election Result: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఒక రకంగా తాము అప్రమత్తంగా కావడానికి ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు. ఈ ఫలితంపై లోతుగా సమీక్షించుకుంటామని వ్యాఖ్యానించారు.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫలితం తాము ఊహించని విధంగా రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చిన ఆరున్నరేళ్లలో అనేక విజయాలు సాధించామని అన్నారు. ఈ ఫలితం ఒక రకంగా తాము అప్రమత్తంగా కావడానికి ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు. ఈ ఫలితంపై లోతుగా సమీక్షించుకుంటామని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఎలాంటి తొత్తరపాటు ఉండకుండా ముందుకు వెళతామని కేటీఆర్ అన్నారు. పార్టీ అధ్యక్షుడి సూచనల మేరకు ముందుకు సాగుతామని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో తమకు ఓటు వేసిన 62 వేల మందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన నేతలకు, మంత్రి హరీశ్ రావును అభినందించారు.

  అంతకుముందు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1400కిపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ ఓడిపోయినట్టు అయ్యింది.దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా మొదటి నుంచి వెనుకబడి ఉన్న టీఆర్ఎస్.. 19వ రౌండ్‌ ముగిసే సమయానికి 250 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యత సాధించడంతో.. ఆ తరువాత ఇదే రకంగా ఫలితాలు ఉంటాయేమో అని అంతా అనుకున్నారు. కానీ 20వ రౌండ్ నుంచి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చిన బీజేేపీ.. 23వ రౌండ్ వరకు ఆ ఆధిక్యతను నిలబెట్టుకుని దుబ్బాక ఉఫ ఎన్నికల్లో విజయం సాధించింది. ఊహించని విధంగా అధికార టీఆర్ఎస్‌కు గట్టిగా షాక్ ఇచ్చింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, KTR, Telangana

  ఉత్తమ కథలు