హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka byelection result: దుబ్బాకలో ఆధిక్యంలో టీఆర్ఎస్.. అయినా తొలగని ఉత్కంఠ

Dubbaka byelection result: దుబ్బాకలో ఆధిక్యంలో టీఆర్ఎస్.. అయినా తొలగని ఉత్కంఠ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dubbaka By election Result: 19వ రౌండ్‌ ముగిసే సమయానికి టీఆర్ఎస్ 250 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది ? కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓట్లు దాదాపుగా సమానంగా పడినట్టు లెక్కలు చెబుతున్నాయి. దీంతో చివరకు దుబ్బాక ఎవరి సొంతమవుతుందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. 19వ రౌండ్‌ ముగిసే సమయానికి టీఆర్ఎస్ 250 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. మరో ఐదు రౌండ్ల కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈ ఐదు రౌండ్లలో ఎవరికి ఓట్లు ఎక్కువగా వస్తాయనే దానిపైనే విజయం ఎవరిని వరిస్తుందనే అంశం ఆధారపడి ఉంది. ఇక ఐదు రౌండ్లకు సంబంధించిన ఓట్లు చేగుంట, నార్సింగికి చెందినవి కావడం... అందులోనూ ఎక్కువ ఓట్లు చేగుంట మండలానికే చెందినవి కావడంతో... దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను చేగుంట మండల డిసైడ్ చేయినుందనే టాక్ వినిపిస్తోంది.

  19 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కావడంతో.. మరో నాలుగు రౌండ్ల కౌంటింగ్ మాత్రమే మిగిలింది. దీంతో ఈ నాలుగు రౌండ్లలో ఎవరు ఆధిక్యతను కనబర్చితే వారే విజేతలుగా నిలవనున్నారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధించినా.. మెజార్టీ చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉందని ట్రెండ్స్‌ను బట్టి అర్థమవుతోంది. ఓట్ల లెక్కింపులో మొదటి 10 రౌండ్లలో వెనుకబడ్డ టీఆర్ఎస్.. 11వ రౌండ్‌ను క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. 19 రౌండ్‌కు వచ్చేసరికి బీజేపీని వెనక్కి నెట్టి స్వల్ప ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో మిగిలిన నాలుగు రౌండ్ల కౌంటింగ్‌కు సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

  14 టేబుళ్ల మీద 23 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతోంది. సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ జరుగుతోంది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana, Trs

  ఉత్తమ కథలు