హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka byelection result: దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు.. టీఆర్ఎస్‌కు బిగ్ షాక్

Dubbaka byelection result: దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు.. టీఆర్ఎస్‌కు బిగ్ షాక్

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

Dubbaka By election Result: మొత్తం 23 రౌండ్ల కౌంటింగ్‌లో 22 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. 22వ రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వెయ్యికి పైగా ఓట్ల మెజార్టీ సాధించడంతో.. ఇక ఆ పార్టీ గెలిచే దాదాపు ఖాయమే అనే టాక్ వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...

  టీ20 మ్యాచ్‌ను తలపించే సస్పెన్స్. చివరి ఓటు లెక్కించే వరకు నరాలు తెగే ఉత్కంఠ. తెలంగాణ వచ్చిన తరువాత ఇంతకుముందెన్నడూ లేనంత హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు. ఇవన్నీ ఎలా ఉంటాయో దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ అందరికీ రుచి చూపించింది. క్షణక్షణానికి మారుతున్న మెజార్టీ. ప్రస్తుతం ఉన్న తమ మెజార్టీ తరువాత రౌండ్‌కు ఉంటుందా ? తరువాత రౌండ్‌లో అయినా తాము మెజార్టీలోకి వస్తామా ? అని టీఆర్ఎస్, బీజేపీలు ఉత్కంఠగా ఎదురుచూసిన సందర్భం. ఇలాంటి ఎన్నికల పోరులో అధికార పార్టీ టీఆర్ఎస్‌పై బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1000కిపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ ఓడిపోయినట్టు అయ్యింది.

  దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా మొదటి నుంచి వెనుకబడి ఉన్న టీఆర్ఎస్.. 19వ రౌండ్‌ ముగిసే సమయానికి 250 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యత సాధించడంతో.. ఆ తరువాత ఇదే రకంగా ఫలితాలు ఉంటాయేమో అని అంతా అనుకున్నారు. కానీ 20వ రౌండ్ నుంచి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చిన బీజేేపీ.. 23వ రౌండ్ వరకు ఆ ఆధిక్యతను నిలబెట్టుకుని దుబ్బాక ఉఫ ఎన్నికల్లో విజయం సాధించింది. ఊహించని విధంగా అధికార టీఆర్ఎస్‌కు గట్టిగా షాక్ ఇచ్చింది.

  టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం కారణంగా వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలుపు భారాన్ని టీఆర్ఎస్ ముఖ్యనేత, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తన భుజాన వేసుకున్నారు. ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రచారం చేయలేదు. మెజార్టీ తగ్గినా.. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు తమదే అని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసింది. అయితే ఈ ఉప ఎన్నికను ఓ ఛాలెంజ్‌గా తీసుకున్న బీజేపీ.. ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించుకుని టీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్యనేతలంతా దుబ్బాకలో గడప గడప తిరిగి ప్రచారం చేశారు. దుబ్బాకలో గతంలో రెండుసార్లు ఓడిపోయిన రఘునందన్ రావుపై నియోజకవర్గ ప్రజలకు సానుభూతి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ అందరికంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు రఘునందన్ రావు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పటికప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలను ఖరారు చేస్తూ.. బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు