హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka: దుబ్బాకలో ముగిసిన పోలింగ్.. ఓటింగ్ పెరిగిందా ? తగ్గిందా ?

Dubbaka: దుబ్బాకలో ముగిసిన పోలింగ్.. ఓటింగ్ పెరిగిందా ? తగ్గిందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dubbaka: దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల సమయానికి 81 శాతం పోలింగ్ నమోదైంది.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆరు గంటలలోపు క్యూ లైన్‌లో నిలబడి ఉన్న వారికి ఓటు హక్కు వేసే అవకాశం కల్పిస్తున్నారు. సాధారణ ఎన్నికల స్థాయిలోనూ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఉదయం నుంచి ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల సమయానికే దాదాపు 30 శాతం పోలింగ్ నమోదుకాగా.. మధ్యాహ్నం ఒంటిగంట దాటే సమయానికి 50 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం మూడు గంటలు దాటే సమయానికి పోలింగ్ శాతం 71 శాతానికి చేరుకుంది. సాయంత్రం ఐదు గంటల సమయానికి 81 శాతం పోలింగ్ రికార్డయ్యింది. దీంతో ఓటింగ్ పూర్తయ్యే సమయానికి పోలింగ్ శాతం మరింతగా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నాయి. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. పోటీలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే జరుగుతుంది.

  టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తులపై దుబ్బాక ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. హోరాహోరిగా జరిగిన ప్రచారంతోపాటు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అందుకే దుబ్బాకలో ఓటింగ్ సరళి మొదలైప్పటికి నుంచే అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ప్రతి ఒక్కరూ పోలింగ్ సరళిపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

  2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దుబ్బాకలో 85 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఉప ఎన్నికల సందర్భంగా అంతకుమించిన స్థాయిలో ఓటింగ్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కరోనా కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు కచ్చితంగా మాస్కులు, గ్లౌజులు ధరించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు