హోమ్ /వార్తలు /తెలంగాణ /

Harish Rao: ట్రబుల్ షూటర్‌ హరీశ్ రావుకు ట్రబుల్.. కేటీఆర్ మాటలకు అర్థమేంటి ?

Harish Rao: ట్రబుల్ షూటర్‌ హరీశ్ రావుకు ట్రబుల్.. కేటీఆర్ మాటలకు అర్థమేంటి ?

మంత్రి హరీష్ రావు (ఫైల్ ఫోటో)

మంత్రి హరీష్ రావు (ఫైల్ ఫోటో)

Harish Rao: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రావడంతో.. టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించిన హరీశ్ రావుకు ట్రబుల్స్ తప్పకపోవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు తెలంగాణ రాజకీయాలతో పాటు టీఆర్ఎస్ రాజకీయాలపై కూడా చాలావరకు ప్రభావం చూపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పడి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ కారణంగానే సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోనూ టీఆర్ఎస్ విజయం అంత కష్టమేమీ కాదని అంతా అనుకున్నారు. అందులోనూ దుబ్బాక ఉప ఎన్నికల వ్యవహారాలను చూసేది హరీశ్ రావు కావడం.. దుబ్బాక సిద్ధిపేటకు పక్కనే ఉన్న నియోజకవర్గం కావడంతో దుబ్బాకలో టీఆర్ఎస్‌ను హరీశ్ రావు చాలా సులభంగా గెలిపిస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.

  కానీ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రావడంతో.. టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించిన హరీశ్ రావుకు ట్రబుల్స్ తప్పకపోవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తరువాత మీడియాలో మాట్లాడిన కేటీఆర్ చేసిన పలు వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫలితం తాము ఊహించని విధంగా రాలేదని మంత్రి కేటీఆర్.. ఈ ఫలితం ఒక రకంగా తమ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తం కావడానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. ఈ ఫలితంపై లోతుగా అన్నారు.

  అయితే కేటీఆర్ వ్యాఖ్యలు హరీశ్ రావు సహా పార్టీ నేతలందరికీ ఒక హెచ్చరిక లాంటిదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు అసలు దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి కారణమేంటనే దానిపై టీఆర్ఎస్ మరింత లోతైన విశ్లేషణ జరిపే అవకాశం ఉందని.. దీనిపై హరీశ్ రావును కారణాలు కోరే అవకాశం కూడా ఉందని చర్చ జరుగుతోంది.

  మరోవైపు ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు దుబ్బాక అభివృద్ధి కోసం పని చేస్తామని అన్నారు. మొత్తానికి ఒకప్పుడు టీఆర్ఎస్ ఓడిపోతుందని భావించిన చోట పార్టీకి విజయాలను అందించిన హరీశ్ రావు.. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పార్టీని గెలిపించలేకపోవడం ఆయనకు ఇబ్బంది కలిగించే అంశమే అనే చర్చ వాదన వినిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Harish Rao, Telangana

  ఉత్తమ కథలు