Dubbaka By-election Result 2020: దుబ్బాకలో కౌంటింగ్ ప్రారంభం... కాసేపట్లో ఫలితం

దుబ్బాకలో కౌంటింగ్ ప్రారంభం... కాసేపట్లో ఫలితం

Dubbaka By-Poll Result 2020: దుబ్బాక ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ హోరు ప్రచారం చేశాయి. కౌంటింగ్ ప్రారంభమైంది.

  • Share this:
    Dubbaka By-election Result 2020: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ జరుగుతోంది. దుబ్బాక అభ్యర్థుల ఫ్యూచర్ కాసేపట్లో తేలనుంది. పలు సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ప్రకారం ఒక సర్వే బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరును సూచిస్తుండగా, మరో సర్వే టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని, మరో సర్వే సంస్థ బీజేపీ జెండా ఎగరడం తథ్యమని చెప్పడంతో ప్రజలు ఎవరిది గెలుపన్నదానిపై ఆసక్తిగా చూస్తున్నారు. ఈటీపీబీఎస్- సర్వీసు ఓటరు-పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అరగంట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఏం మిషన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి రౌండ్ కు సంబంధించిన కౌంటింగ్ వారీగా ఎంట్రీలు చేపట్టనున్నారు. అదే విధంగా బ్రాండ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యంతో పాటు వీడియో గ్రఫీ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్ర ఆవరణలో మీడియా రూమ్ ఏర్పాటు చేసి రౌండ్ వారీగా కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు అందజేయనున్నారు.

    Bihar Election Result 2020 | Dubbaka Bypoll Result Live Updates: దుబ్బాక - బీహార్‌లో మొదలైన కౌంటింగ్

    మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. కరోనా వ్యాధి వ్యాప్తి దృష్ట్యా రెండు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతీ హాల్ లో 7 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈసారి 80 శాతం పోలింగ్ జరగడంతో... గెలుపు ఎవరిదన్నది ఉత్కంఠగా మారింది.

    దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు.
    Published by:Krishna Kumar N
    First published: