Hyderabad NewYear Report: ఒక్క పూటలోనే ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులా..? న్యూ ఇయర్ జోష్ మటాష్..!

ప్రతీకాత్మక చిత్రం

కొత్త ఏడాది సందర్భంగా మద్యం షాపులన్నీ అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటాయని ఆబ్కారీ శాఖ ప్రకటించిందో లేదో, అటు పోలీసు శాఖ కూడా వెంటనే రియాక్టయింది. ఒక్క హైదరాబాద్ లోనే నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా..? అక్షరాలా 1814. అవును ఇవి కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాత్రమే.

  • Share this:
    హైదరాబాద్: న్యూ ఇయర్ జోష్ అయిపోయింది. ఫ్రెండ్స్ తో పార్టీలు, పబ్బుల్లో డాన్సులు, రోడ్లపై రయ్యి రయ్యిమంటూ బైకులతో హోరెత్తించడాలు అన్నీ పూర్తయ్యాయి. హైదరాబాద్ వాసులంతా యథావిథిగా తమ తమ రోజువారీ పనుల్లో మునిగిపోయారు. ఎవరి పనుల్లో వారు పడిపోయారు. మరి పోలీసులు కూడా వారి డ్యూటీ వాళ్లు చేయాలి కదా. కొత్త ఏడాది సందర్భంగా మద్యం షాపులన్నీ అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటాయని ఆబ్కారీ శాఖ ప్రకటించిందో లేదో, అటు పోలీసు శాఖ కూడా వెంటనే రియాక్టయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తామని తేల్చిచెప్పింది. అన్నట్టుగానే డిసెంబర్ 31 రాత్రి నుంచి ఒకటో తేదీ తెల్లవారు జామున వరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో మునిగిపోయారు. ఫలితంగా భారీ స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

    ఒక్క హైదరాబాద్ లోనే నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా..? అక్షరాలా 1814. అవును ఇవి కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాత్రమే. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 387, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 931, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 496 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అధికంగా గచ్చిబౌలీ, నార్సింగి, మాదాపూర్, రాయదుర్గం, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ పరిధిలో నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైన వాటిల్లో బైకులు 721 కాగా, ఆటోలు 18, కార్లు 190 ఉన్నాయి.

    ఇదిలా ఉండే ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. 2016-2017వ కొత్త సంవత్సర వేడుకల్లో 1594 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.. 2017-2018 సంవత్సరం వేడుకల్లో 2293 కేసులు, 2018-2019 సెలబ్రేషన్స్ లో 2499 కేసులు, 2019-20 వేడుకల్లో 2091 కేసులు నమోదుకాగా, తాజాగా ఈ ఏడాది 1814 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా తీవ్రత కూడా దీనికి ప్రధాన కారణమయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే కాకుండా 367 ర్యాష్ డ్రైవింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. 238 త్రిపుల్ రైడింగ్ కేసులు, 247 ఓవర్ స్పీడ్ కేసులను కూడా నమోదు చేసినట్లు పోలీసు శాఖ అధికారికంగా వెల్లడించింది.
    Published by:Hasaan Kandula
    First published: