హైదరాబాద్ మెట్రోరైల్లో మందేసి... చిందేసిన ప్రయాణికుడు

డాన్సులు చేస్తూ మెట్రోలో ఉన్న ఇతర ప్రయాణికులను బెంబేలెత్తించాడు.

news18-telugu
Updated: September 14, 2019, 9:00 AM IST
హైదరాబాద్ మెట్రోరైల్లో మందేసి... చిందేసిన ప్రయాణికుడు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 14, 2019, 9:00 AM IST
మెట్రోలో.. మెట్రో స్టేషన్లలో ఈ మధ్య రకరకాల ఘటనలు చోటు చేసుకుంటన్నాయి. తాజాగా మెటరో రైలు ఎక్కిన ప్రయాణికుడు ఒకరు మద్యం మత్తులో హల్‌చల్‌ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాగిన మత్తులో ఉన్న ఒక వ్యక్తి నిల్చోలేని స్థితిలో డాన్సులు చేస్తూ మెట్రోలో ఉన్న ఇతర ప్రయాణికులను బెంబేలెత్తించాడు.సెల్ఫీలు తీసుకుంటూ... ట్రైన్‌లో ఉన్న ఇతర ప్రయాణీకుల ఫోటోల్ని కూడా తీసేందుకు ప్రయత్నించాడు. చివరికి తోటి ప్రయాణికులు అతడ్ని అడ్డుకుని మెట్రో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తార్నాక మార్గంలో రూట్‌లో స్టేషన్‌లో దిగిపోయాడు. అయితే 8వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మెట్రో స్టేషన్లలో సరైన తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో మద్యం తాగిన వారు సైతం మెట్రో ఎక్కడం ఇబ్బందిగా మారిందని తోటి ప్రయాణికులు వాపోతున్నారు. అయితే ఈ ఘటనపై దీనిపై మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి స్పందించారు. ఇలాంటి వాటిపై ప్రయాణికులు తక్షణ ఫిర్యాదు చేసేందుకు త్వరలోనే వాట్సాప్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

 


First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...