Home /News /telangana /

DRUGS PEDLER TONY INTO POLICE CUSTODY OF PANJAGUTTA VRY

Hyderabad :పోలీసు కస్టడికి డ్రగ్ పెడ్లర్.. 5 రోజుల పాటు విచారణ... ఏం తేలనుంది...?

 డ్రగ్ పెడ్లర్ టోని

డ్రగ్ పెడ్లర్ టోని

Hyderabad : అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనిని పంజాగుట్ట పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఐదు రోజుల పాటు టోనిని ప్రత్యేక బృందం విచారణ జరపనుంది.

    అంతర్జాతీయ ముఠాలో కీలక వ్యక్తిగా ఉన్న డ్రగ్‌ పెడ్లర్‌ టోనీని హైదరాబాద్‌ పోలీసులు శనివారం తమ కస్టడీలోకి తీకున్నారు... ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న టోనిని విచారణ కోసం పంజగుట్ట పోలీసులు తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పోలీసులకు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే చంచల్‌గూడ జైలునుంచి పోలీసులు టోనీని తరలించారు... 34 మంది వ్యాపారులకు హోల్‌సేల్‌గా టోనీ డ్రగ్స్‌ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. కాగా టోనిని ఐదు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. కాగా డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న వ్యాపారస్తులను కూడా కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ ధాఖలు చేసినా.. కోర్టు తిరస్కరించింది. విచారణలో భాగంగా ఎవరెవరికి డ్రగ్స్ అందించారనే అంశాలపై విచారణ జరపనున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారంలో సుమారు వేయి కోట్ల రూపాయల దందా కొనసాగినట్టు సమాచారం.

    కాగా ఓయో హోటళ్లను అడ్డాగా చేసుకుని ముంబయితో నివాసం ఉండే టోని డ్రగ్ రాకేట్ నడిపారు. ముంబయి కేంద్రంగా 2013 లో ఈ డ్రగ్ వ్యాపారం సినిమా ఫక్కిలో డ్రగ్ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అండర్ గ్రౌండ్‌లో ఉంటూనే బడా వ్యాపారులతో పాటు, విద్యార్థుల టార్గెట్‌గా వ్యాపారం కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సీపీ ఆనంద్ నేతృత్వంలో టోని గ్యాంగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన నగర పోలీసులు కీలక సూత్రదారిని అరెస్ట్ చేశారు. దీంతో ఐదు రోజుల పాటు ప్రత్యేక బృందం విచారణ జరగనుంది.

    Schools reopen : ఫిబ్రవరి 1 నుండి స్కూళ్లు రీ ఓపెన్... ప్రకటించిన అధికారులు.

    డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని సీఎం చాలా సీరియస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే వినియోగదారులతో పాటు డ్రగ్స్ సరఫరా చేసే వారిపై మాత్రమే పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ టోనిని అరెస్ట్ చేశారు. ఈ మాఫియా అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. టోని విచారణలో టోని ఎవరెవరికి డ్రగ్స్ అమ్మారు. ఎవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ జరపనున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Drugs, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు