హైదరాబాద్ నగర పోలీసులకు సవాల్ విసిరిన డ్రగ్స్‌తో పాటు గంజాయి మాఫియా పై గత కొద్ది కాలంగా ఉక్కుపాదం పాదం మోపుతున్న విషయం తెలిసిందే.. అయితే పోలీసులు డ్రగ్స్ మాఫియాను పట్టుకోవడం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపడడం లాంటి చర్యలు చేపడుతూ కంట్రోల్లోకి తీసుకువస్తున్నారు.. ముఖ్యంగా గంజాయి అమ్మకాల సరఫరాను కనుగొని వారిపై ఉక్కుపాదం మోపారు.అయితే ఇది భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల నుండే సరఫరా అవుతుండడంతో పాటు పక్కరాష్ట్రం ఏపీలో కూడా సాగు అవుతుండడంతో పెద్ద ఎత్తున దాడులు చేసి గంజాయి సాగును ధ్వంసం చేయడంతో ఇటివల గంజాయి సప్లై తగ్గిపోయింది.
కాని డ్రగ్స్ సప్లై దారుల మాఫియాకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉండడం, విదేశాల నుండి డ్రగ్స్ సరఫరా అవుతుంటుంది.. దీనిపై ఎంత కట్రోల్ చేసిన కోత్త మాఫియా పుట్టుకువస్తూనే ఉంటుంది. ఇలా వారిపై ఎన్ని కేసులు పెట్టినా.. ప్రయోజనం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు డ్రగ్స్ అమ్మకమే కాదు.. దాన్ని వినియోగించే వారిని ఈసారి టార్గెట్ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా డిమాండ్ లేకుండా డ్రగ్స్ సప్లై ఉండదనే సూత్రంతో ముందుకు సాగేందుకు నిర్ణయించారు. కాగా ఇన్నాళ్లు డ్రగ్స్ అమ్మెవారిపై చర్యలు తీసుకుంటున్న పోలీసులు అవి వినియోగిస్తున్న విద్యార్థులు, యువకులను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. అయితే ఇదే అదనుగా తీసుకుంటున్న డ్రగ్ వినియోగ దారులు వాటిని అమ్మెందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.. అలవాటు కాస్తా స్మగ్లర్లుగా మారుస్తుందనే అభిప్రాయానికి వచ్చారు.
Hyderabad : సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని తొలగించిన మున్సిపల్ అధికారులు.. ఉదయం వెలిసింది.. సాయంత్రం..
దీంతో డ్రగ్స్ వాడుతున్న యువకులు, విద్యార్థులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమయ్యారు. వారి భవిష్యత్ పై ఇక ఆలోచన లేకుండా చట్టపరమైన కేసులు పెట్టాలని నిర్ణయించారు. డ్రగ్స్ మాఫియా ద్వారా కొనుగోలు చేస్తున్న వారిని కూడా కటకటాలపాలు ( 27 సెక్షన్ ) చేయాలని నిర్ణయించారు. ముందుగా వినియోగదారులను కట్ చేస్తే సప్లై దారులు వెనక్కి తగ్గుతారనే నమ్మకంతో ఈ చర్యలకు శ్రీకారం చుట్టినట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
ఇలా ఓ వైపు డ్రగ్స్ సప్లై దారులపై నిఘాపెడుతూనే మరోవైపు డ్రగ్స్ వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇన్నాళ్లు వినియోగదారులను పట్టించుకోని పోలీలసులు తాజాగా డ్రగ్స్ వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, చివరికి డెలివరి బాయ్స్ సైతం డ్రగ్స్ వినియోగిస్తుండడంతో ఎవ్వరిని వదలకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు.ఇలా నగరంలో డ్రగ్స్ వాడుతున్న 11 మంది సాఫ్ట్వేర్లు, 8 మంది విద్యార్థులతో పాటు ఐటి కంపనీలకు చెందిన ఉన్నతాధికారులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వీరంతా హౌజ్ పార్టీల పేరుతో డ్రగ్స్ సేవిస్తున్నట్టు సీపి సీవీ ఆనంద్ చెప్పారు. వీరిలో పలువురి పేర్లు, సంస్థల పేర్లను కూడా వెళ్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drugs, Hyderabad, Hyderabad police