Home /News /telangana /

Gadwala : కేసిఆర్ డౌన్‌..డౌన్.. మందుబాబుల హల్‌చల్..ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ వద్ద.. ధర్నా..

Gadwala : కేసిఆర్ డౌన్‌..డౌన్.. మందుబాబుల హల్‌చల్..ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ వద్ద.. ధర్నా..

drunken and drive

drunken and drive

Gadwala : కేసిఆర్.. డౌన్, డౌన్.. అంటూ మందుబాబులు హల్‌చల్.. ఓ వైపు మందు మరోవైపు డ్రంకన్‌ డ్రైవ్ కేసులా అంటూ.. ఆందోళన... మందు మీమే తాగాలి...కేసులు కూడా మామీదనేనా అంటూ టాక్స్ పేయర్స్ పోలీసులతో వాగ్వావాదానికి దిగారు..

    న్యూస్ 18  మహబూబ్ నగర్.. సయ్యద్ రఫీ...

    ఆంధ్రా , తెలంగాణ బోర్డర్ వద్ద వింత పరిస్థితి ఎదురైంది.. ఓ వైపు మందు అమ్ముతూనే మరోవైపు డ్రంకన్ డ్రైవ్ టెస్టులు పెట్టడడంతో మందు బాబులు విసిగిపోయారు.. ( Dharna agaianst Dunk and drive ) మందు మీరే అమ్ముతారు... డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో కూడా మీరే కేసులు పెడతారా...అంటూ.. ఆందోళన చేపట్టిన పరిస్థితి ఏర్పడింది.

    వివరాల్లోకి వెళితే... జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో వైన్ షాప్ ఉంది. ఇది తెలంగాణ ఆంధ్ర సరిహద్దు. కాగా పాలమూరు జిల్లాలో అత్యధిక రాబడి ఈ వైన్ షాప్ ఇది. దీనికి కారణం సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన ఆంధ్ర మందుబాబులు పెద్ద ఎత్తున ఇక్కడ మందు కొనుగోలు చేయడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ( Dharna agaianst Dunk and drive )ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఉండవల్లి పోలీసులు పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు చాలామంది మందు బాబులను పట్టుకొని వారి నుండి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో ఉన్న మందుబాబులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఇక్కడ మందు అమ్ముతారు అక్కడ కేసులు పెడతారా ఇదెక్కడి న్యాయం అంటూ రోడ్లపై బైఠాయించారు.( Dharna agaianst Dunk and drive ) ఈ క్రమంలో కొంతమంది వాహనదారులు తమ వాహనాలను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు మందుబాబులకు పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. దీంతో మందుబాబులు ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.


    kamareddy : పరిచయం ఉన్న మేస్త్రీతో కలిసి వెళ్లింది..కుళ్లిన శవంగా మారింది... !


    ప్రతి సాధారణ మందు బాబుకి వచ్చే కామన్ క్వశ్చనే ఇది.. ప్రభుత్వమే తాగమని మందు అమ్ముతుంది. బార్లు, రెస్టారెంట్‌లకు పర్మిషన్ ఇస్తుంది. తీరా అందులో తాగి వెళుతుంటే.. మధ్యలో ఆపి డ్రంకన్‌ డ్రైవ్ కేసులు పెడుతుంటారు... ( Dharna agaianst Dunk and drive )ఇవి మందుబాబుల ప్రశ్నలే.. కాదు.. ఆవేదన కూడా.. డ్రంకన్‌ డ్రైవ్‌లో చిక్కుకుని పరువు పొగొట్టుకుని మదన పడిన వాళ్లు ఎందరో ఇప్పుడు వీరి ధర్నాకు సపోర్టు చేస్తారు కూడా..


    Teenmar mallanna : కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావులను కట్టేసి, ఆ కుటుంబాలతో కొట్టిస్తా...!


    అయితే అల్కహాల్ వ్యాపారం నిర్వహించేది ఎక్సైజ్ శాఖ అయితే.. తాగకుండా డ్రైవింగ్ చేయాలనే చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులది అందుకే వారి డ్యూటి వారు చేస్తున్నారు... కాని ప్రస్తుతం ఆందోళన చేసిన మందుబాబులకు ఈ విషయాలు తెలిసినా..( Dharna agaianst Dunk and drive ) మందు మాయలో పడి అందరు ఏకం కావడంతో ట్రాఫిక్ పోలీసులు నిలబడి చూడడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి కనిపించింది.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Gadwal, Police, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు