HOME »NEWS »TELANGANA »dri seizes rs 10 crores methamphetamine drugs at hyderabad airport sk

Hyderabad: హైదరాబాద్‌లో రూ.10 కోట్లు డ్రగ్స్ సీజ్.. అచ్చం వీడొక్కడే మూవీలాగే..

Hyderabad: హైదరాబాద్‌లో రూ.10 కోట్లు డ్రగ్స్ సీజ్.. అచ్చం వీడొక్కడే మూవీలాగే..
ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: మెథంఫెటామిన్ అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యమని డీఆర్ఐ అధికారులు తెలిపారు. దీనిని ఆహార పదార్థాల్లో కలిపి తీసుకుంటారని వెల్లడించారు.

  • Share this:
    హైదరాబాద్‌‌లో మరోసారి పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. విదేశాలల నుంచి వచ్చిన ఓ ముఠా భారీగా డ్రగ్స్‌ను పట్టుకొచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు తనిఖీ చేస్తుండగా.. రూ.10 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. వాటిని సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేశారు. అతడి వద్ద పలు ఆహార పదార్థాలు కనిపించాయి. ఏదో తేడా కొట్టడంతో వాటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అందులో భారీగా డ్రగ్స్ లభించడంతో అందరూ షాక్ తిన్నారు. సుమారు కిలో మేర మెథాంఫెటామిన్ (methamphetamine) డ్రగ్‌ను అధికారులు పట్టుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో పది కోట్ల రూపాయలపైనే ఉంటుందని సమాచారం.

    మెథంఫెటామిన్ అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యమని డీఆర్ఐ అధికారులు తెలిపారు. దీనిని ఆహార పదార్థాల్లో కలిపి తీసుకుంటారని వెల్లడించారు. అచ్చం వీడొక్కడే సినిమాలో చూపించినట్లుగా నగరంలోకి మాదక ద్రవ్యాలను తీసుకొచ్చారు నిందితులు. ఆ సినిమాలో గణేష్ విగ్రహంలో డ్రగ్స్‌ను కలిపిస్తే.. ఇక్కడ ఆహార పదార్థాల్లో మాదక ద్రవ్యాలను కలిపేశారు. మరో పది రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు జరగనున్నాయి. ఆ రోజు నగరంలో పెద్ద ఎత్తున పార్టీలు జరుగుతాయి. ఈ క్రమంలోనే న్యూఇయర్ వేడుకల కోసం డ్రగ్స్‌ను తీసుకొచ్చారు కేటుగాళ్లు. అసలు ఈ డ్రగ్స్‌ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దీని వెనక ఎవరున్నారు? అనే వివరాలను డీఆర్ఐ అధికారులు కూపీ లాగుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:December 19, 2020, 19:49 IST