శంషాబాద్‌‌లో గోల్డ్ స్మగ్లింగ్..14 కేజీల బంగారం స్వాధీనం

గురువారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ బంగారం దొరికింది. బంగారం బిస్కెట్లను బ్లాక్ కలర్ టేప్‌తో చుట్టి విమానం సీట్ల కింద దాచిపెట్టి రవాణా చేశారు.

news18-telugu
Updated: December 12, 2019, 7:10 PM IST
శంషాబాద్‌‌లో గోల్డ్ స్మగ్లింగ్..14 కేజీల బంగారం స్వాధీనం
సీజ్ చేసిన బంగారం
  • Share this:
శంషాబాద్ ఎయిర్‌పోర్టు గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ఇద్దరు విదేశీలయును డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 14 కోట్ల 46 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

గురువారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ బంగారం దొరికింది. బంగారం బిస్కెట్లను బ్లాక్ కలర్ టేప్‌తో చుట్టి విమానం సీట్ల కింద దాచిపెట్టి రవాణా చేశారు. అరెస్టైన వారిలో ఒకరు సౌత్ కొరియా కాగా, మరొకరు చైనాకు చెందిన పౌరులని అధికారులు వెల్లడించారు. బంగారం అక్రమ రవాణాలో విమాన సిబ్బంది పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

First published: December 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>