స్వీట్ బాక్స్‌లో కోటిన్నర కరెన్సీ కట్టలు...వీళ్లు మహా ముదుర్లు

ఆ డబ్బాల్లో పెద్ద మొత్తంలో సౌదీ కరెన్సీ బయటపడింది. దాని విలువ రూ.కోటిన్నర ఉంటుందని అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: August 20, 2019, 6:43 PM IST
స్వీట్ బాక్స్‌లో కోటిన్నర కరెన్సీ కట్టలు...వీళ్లు మహా ముదుర్లు
బిస్కెట్ బాక్స్‌లో విదేశీ కరెన్సీ
  • Share this:
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని DRI అధికారులు పట్టుకున్నారు. స్వీట్, బిస్కెట్ బాక్స్‌ల్లో కరెన్సీని దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ కేంద్రంగా బంగారం, విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరుగుతున్న నేపథ్యంలో డీఆర్ఎఐ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమాన ప్రయాణికులను తనిఖీలు చేశారు. ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వద్ద ఉన్న స్వీట్, బిస్కెట్ బాక్సులను క్షుణ్ణుంగా పరిశీలించారు. ఆ డబ్బాల్లో పెద్ద మొత్తంలో సౌదీ కరెన్సీ బయటపడింది. దాని విలువ రూ.కోటిన్నర ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>