DOUBLE MARRIAGE WITH SINGLE WOMAN AT SHAMSHABAD IN HYDERABAD VRY
Double Marriage : ఒకే జంట.. పిల్లలకు ముందు ఓసారి .. ఆ తర్వాత మరోసారి.. !
love marriage
Double Marriage : ఒకే మహిళతో.. పిల్లలకు ముందు ఒకసారి పిల్లలు పుట్టి పెద్దయ్యాక మరోపెళ్లి జరుగుతోంది.అదేలా సాధ్యం అనుకుంటున్నారా... ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతోంది. ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారికి ఇదోక మంచి అవకాశం.
పెళ్లి అనేది జీవితకాలం గుర్తుండి పోయో ఓ అపురూపమైన ఘటన.. దాని కోసం యువతి యువకులు అనేక కళలు కంటారు.. ఎంతో వైభవంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తారు.. కాని కొంతమందికి ముఖ్యంగా ప్రేమికులకు వారి కళలు సాధ్యం కావు. ఎందుకంటే ప్రేమించుకున్న వారికి అనేక అడ్డంకులు, ఇంట్లో ఒప్పుకోకపోవడం, సమాజం అంగీకరించకపోవడం లాంటీ అంశాలు ప్రేమికులు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు అడ్డంకింగా మారుతాయి.. దీంతో తూతు మంత్రంగా ఇద్దరు ,ముగ్గురు స్నేహితుల మద్యే పెళ్లిలు చేసుకుంటారు. దీంతో పెళ్లికి ముందు పడ్డ ఆశ నిరాశగానే నిలిచిపోతాయి.. పెళ్లి తర్వాత సంసార జీవితంలో పడి తమ కళలకు ఫుల్స్టాప్ పెడతారు.
కాని హైదరాబాద్‌కు చెందిన ఓ జంట మాత్రం తమ కళలను సాకారం చేసుకునేందుకు సిద్దమయ్యారు. తమ పెళ్లిని మరోసారి చేసుకునేందుకు సన్నద్దమయ్యారు. బంధువుల మధ్య అంగరంగ వైభవంగా చేసుకోవడమే కాదు.. తన ఇద్దరు పిల్లల మధ్య ఆ పెళ్లికి సిద్దమవుతున్నారు. అదేలా సాధ్యం అనుకంటున్నారా.. అది సాధ్యం ఒకసారి పెళ్లి అయిన వారు వారి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో పెళ్లి కోరిక తీర్చుకుంటున్నారు. అదికూడా పిల్లలు బంధువులతో హడావుడిగా కార్యక్రమం కొనసాగుతోంది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ చంపాపేట్‌కు చెందిన నాగిరెడ్డి నగరంలోని ఓ లా కాలేజీలో విద్యార్థిగా చేరాడు..అయితే అదే బ్యాచ్‌లో వరంగల్‌కు చెందిన సంస్కృత అనే విద్యార్థిని కూడా ఉన్నారు. అక్కడ ఆమెతో నాగిరెడ్డి పరిచయం ప్రేమగా మారి పెళ్లిపీటలెక్కింది. కాని వారి ప్రేమ వివాహానికి ఇంట్లో సభ్యులు ఒప్పుకోలేదు. వాళ్లు ఇద్దరు ఉన్నత చదువులు చదివినా.. వారి మాట వినే పరిస్థితి మాత్రం కనిపించలేదు...మరోవైపు సంస్కృత కుటుంబానికి ఓ ప్రజాప్రతినిధి అండ కూడా ఉండడంతో వారు పెళ్లికి నిరాకించడంటో పాటు అడ్డుకునే ప్రయత్నం చేశారు..
దీంతో నాగిరెడ్డి ఒడిశాలోని స్నేహితుడి వద్దకు సంస్కృతతో వెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్నాడు.. అతడి సాయంతో ఓ ఇంటివాడయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు. చేసేది ఏమిలేక వారం తర్వాత ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో ఆ జంట తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం నాగిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ, ఇద్దరికి మనసులో మాత్రం ఏదో వెలితి కనిపించింది. అన్ని ఉన్నా ఘణంగా పెళ్లి చేసుకోలేక పోయామనే బాధ వారిలో ఉంది.. దీంతో మరోసారి తమ పెళ్లికి అవకాశం ఉందా అంటూ వేద పండితులను సంప్రదించారు..అయితే ఆ పండితులు రెండు సార్లు ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం కుదరదని, ఇలా మరోసారి పెళ్లి చేసుకోవాలంటే పాతికేళ్లు ఆగాలని అంటే సిల్వర్ జూబ్లీ వేడుకలు సమయంలో మరోసారి చేసుకోవచ్చని ఇరుకుటుంబాల పెద్దలు వీరికి సూచించారు. దీంతో అప్పటి వరకు వేచి చూసిన కుటుంబ సభ్యులు తిరిగి మరోసారి సిల్వర్ జూబ్లీ సంధర్భంగా సాంప్రదాయకంగా పెళ్లి చేసుకునేందుక రెఢీ అయ్యారు. దీంతో స్నేహితులతో పాటు బంధువుల మధ్య ఈనెల 24న శంశాబాద్ నర్కూడలోని అమ్మపల్లి రామాలయంలో పెళ్లి పీటలెక్కెనున్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.