ముగిసిన సూర్యగ్రహణం.. తెరుచుకున్న యాదాద్రి ఆలయం..

ఈ ఏడాదిలో ఎక్కువ నిడివి కలిగినది కూడా ఇదే కావడం గమనార్హం. ఉదయం 10.14గంటలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 1.49 గంటలకు ముగిసింది.

news18-telugu
Updated: June 21, 2020, 5:51 PM IST
ముగిసిన సూర్యగ్రహణం.. తెరుచుకున్న యాదాద్రి ఆలయం..
యాదాద్రి టెంపుల్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గ్రహణం ముగియడంతో ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. సూర్యగ్రహణం కారణంగా శనివారం రాత్రి ఆలయ అర్చకుల సమక్షంలో బాలాలయం ద్వారాలు మూసి తాళాలు వేశారు. ఆదివారం మధ్యాహ్నాం 3 గంటల వరకు ఆలయాన్ని మూసి ఉంచారు. సూర్యగ్రహణం ముగియడంతో యాదాద్రి ఆలయాన్ని అర్చకులు తెరిచారు. ఆలయంలో శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం పూజల నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఆదివారం ‘త్రిపాద రాహుగ్రస్త’ సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఎక్కువ నిడివి కలిగినది కూడా ఇదే కావడం గమనార్హం. ఉదయం 10.14గంటలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 1.49 గంటలకు ముగిసింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతోపాటు దేవాలయాలన్నిటినీ మూసివేశారు. గ్రహణ మోక్షకాలం అనంతరం సంప్రోక్షణ, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు దాని అనుబంధ దేవాలయాల్లో ఈ రోజు భక్తులకు దర్శనం కల్పిస్తారు. అనంతరం యథావిధిగా పూజలు నిర్వహించనున్నారు.




First published: June 21, 2020, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading