హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్... మియాపూర్ భూముల జోలికి వెళ్లొద్దని ఆదేశం...

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్... మియాపూర్ భూముల జోలికి వెళ్లొద్దని ఆదేశం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Update : మొదటి నుంచీ మియాపూర్ భూముల వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే తయారైంది.

  తాము తీసుకునే ప్రతీ నిర్ణయమూ సరైనదేననీ, అన్నీ లెక్కలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తరచూ చెప్పే తెలంగాణ ప్రభుత్వం మియాపూర్ భూముల విషయంలో తప్పటడుగు వేసిందా. అవునన్నట్లు అర్థమవుతోంది తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని పరిశీలిస్తే. మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రద్దు ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకూ... భూముల సేల్ డీడ్ రద్దు నిర్ణయంపై స్టే విధించింది హైకోర్టు. మియాపూర్ భూములను యథావిథిగా ఉంచాలని స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది


  మియాపూర్ భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు పరిష్కారం అయ్యేంత వరకూ మియపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ, ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం కానీ చేయకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారి పట్ల తమకు సానుభూతి ఉండదని హైకోర్టు అభిప్రాయపడింది.


  ఇది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఆదేశమే. ఐతే... మియాపూర్ భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కేసులు ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియని పరిస్థితి. అందుకు ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేం. అందువల్ల ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకునే అవకాశాలు లేవు. ఒకవేళ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తే మాత్రం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశం కీలకమవుతుంది.


  మియాపూర్, బాలానగర్‌ ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన భూములకు అక్రమ రిజిస్టేషన్లతో అక్రమార్కులకు అమ్ముతున్నారంటూ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పుతో ఇప్పుడు మియాపూర్ భూముల విషయంలో యధాతథ స్థితి కొనసాగనుంది.


   


  ఇవి కూడా చదవండి :


  బ్యాంకుల్లో డబ్బుల్లేవా... SBIపై మండిపడుతున్న మహిళలు, రైతులు


  వీవీప్యాట్ల లెక్కింపు ప్రజల కోసమా... చంద్రబాబు కోసమా... వైసీపీ ఎందుకలా అంటోంది....


  50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే... మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామన్న చంద్రబాబు...


  ప్రేమించుకున్నారు... బ్రేకప్ అయ్యింది... ఆ తర్వాత ఆమెకు పోర్న్ ఫొటోలు పంపి...

  First published:

  Tags: CM KCR, High Court, Kcr, Telangana News

  ఉత్తమ కథలు