Home /News /telangana /

DONT ASK AADHAR CARD DETAILS FOR REGISTRATION HIGH COURT TELLS TELANGANA GOVT BA

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిజిస్ట్రేషన్ లు యధావిధిగా కొనసాగించాలి కానీ రిజిస్ట్రేషన్ అథారిటీ మాత్రం ఆధార్ కార్డ్ వివరాలు అడగొద్దని తేల్చి చెప్పింది. వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ మినహాయించి ఇతర గుర్తింపు కార్డులను అగీకరించాలని హైకోర్టు అదేశించింది.

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టర్ వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి సర్కారు కోర్టుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ధరణి పోర్టల్ వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు లో విచారణ జరిగింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం స్లాట్ బుకింగ్ కానీ PTIN (ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్) కు ఆధార్ అవసరం లేదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. దాన్ని అమలు చేయడంలో విఫలమైందన్నారు. సమ్మరీ ట్రాంజక్షన్ లో కూడా ఆధార్ కార్డ్ నెంబర్ అడగడాన్ని తప్పు బట్టింది. ఆధార్ కార్డు వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగొద్దని ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఆధార్ కార్డ్ కాకుండా ఏదైనా ఆడగవచ్చని తెలిపింది. PTIN స్లాట్ బుకింగ్ పేరుమీద ఆధార్ నెంబర్ అడగడం సరైంది కాదని స్పష్టం చేసింది. ఎక్కడ కూడా ఆధార్ కార్డు వివరాలు, వ్యక్తిగత వివరాలు సేకరించొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు అదేశించింది. ఆస్తులు అమ్మేవారు, కొనేవారు, సాక్షుల వ్యక్తి గత వివరాలు, ఆధార్ కార్డుల వివరాలు అడగొద్దని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తీసుకున్న వాటిని సాఫ్ట్ వేర్ నుంచి తొలగించాలని ఆదేశించింది.

    రిజిస్ట్రేషన్ లు యధావిధిగా కొనసాగించాలి కానీ రిజిస్ట్రేషన్ అథారిటీ మాత్రం ఆధార్ కార్డ్ వివరాలు అడగొద్దని తేల్చి చెప్పింది. వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ మినహాయించి ఇతర గుర్తింపు కార్డులను అగీకరించాలని హైకోర్టు అదేశించింది. హైకోర్టు సూచనలను క్యాబినెట్ సబ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సవరణ కు వారం రోజులు సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది హైకోర్టు.

    తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సుమారు 3 నెలల తర్వాత ప్రారంభమైంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పాత పద్ధతిలోనేచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కానీ, వాస్తవంలో అలా జరగడం లేదని, కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారంటూ మూడు రోజులుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇతరులు, డాక్యుమెంట్ రైటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంగా ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌కు రిజిస్ట్రేషన్‌కు లింకు పెట్టడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. అటు అన్‌లైన్‌లో ఈసీ కనిపించడం లేదు. బ్యాంక్ మార్టిగేజ్ ఆప్షన్‌ కూడా పోర్టల్ లో దొరకడం లేదు. దీంతో పేరుకు పాత పద్ధతే అయినా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో కూడా ధరణి పద్దతినే అనుసరిస్తున్నారని బిల్డర్లు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పటికైనా సాంకేతిక సమస్యలు తొలగించాలని కోరుతున్నారు. దీంతోపాటు ఆధార్ కార్డు వద్దని కోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్లీ ఆధార్ కార్డు అడగడాన్ని వినియోగదారులు కూడా తప్పు పడుతున్నారు. హైకోర్టుకు ఒకటి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. దీనిపై భిన్న వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Dharani Portal, Telangana, Telangana High Court

    తదుపరి వార్తలు