హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : విద్యాంజలి కార్యక్రమంపై స్పందన కరువు .. ఆ జిల్లాల్లో శ్రీమంతులు ఎవరూ లేనట్లేగా..?

Telangana : విద్యాంజలి కార్యక్రమంపై స్పందన కరువు .. ఆ జిల్లాల్లో శ్రీమంతులు ఎవరూ లేనట్లేగా..?

mbnr govt school

mbnr govt school

Telangana : ప్రభుత్వ పాఠశాలలను సమాజ భాగస్వామ్యంతో అభివృద్ధి పరచాలన్నది ఆ పథకం ముఖ్య ఉద్దేశం. కాని తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆ కార్యక్రమానికి సరైన స్పందన లభించడం లేదు. ఎందుకంటే.

  (Syed Rafi, News18,Mahabubnagar)

  విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల రుణం తీర్చేందుకు చదువుకున్న బడి(School)ని సొంత నిధులతో అభివృద్ధి చేసేందుకు పూర్వ విద్యార్థులు(Alumni), దాతలు(Donors), ప్రవాస భారతీయుల(NRI)కు మన ఊరు - మనబడి (Mana ooru - Mana badi)ద్వారా తమ వంతు సహకారం అందించే అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలల బలోపేతం కోసం సమాజ భాగ్యస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం విద్యాంజలి(Vidyanjali) పేరుతో గతేడాది నవంబర్(November)లో కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఈ రెండు కార్యక్రమాల లక్ష్యం ఒకటే లక్షలాది నిరుపేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న సర్కారీ బడుల్లో దాతల సహకారంతో సకల వసతులతో పాటు నాణ్యమైన విద్య అందించడం. అంతటి మహత్తర లక్ష్యం ఉన్న కార్యక్రమాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్(Mahabubnagar)జిల్లాలో స్పందన కరువైంది.

  Telangana : భర్తను వదిలేసి 3ఏళ్లుగా బాత్రూంలోనే ఉంటున్న యువతి .. జరిగిందేంటో తెలిస్తే షాక్ అవుతారు  స్పందన అంతంత మాత్రమే..

  మన ఊరు - మనబడి మొదటి దశలో ఎంపికైన పాఠశాలల్లో దాతల కోసం ప్రత్యేక ఖాతాలు తెరిచినప్పటికి ప్రభుత్వాలు, ప్రజలు ఊహించిన స్పందన రాలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 3,139 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1, 0 9 9 పాఠశాలల్ని మొదటి విడతగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. అన్నీ పాఠశాలలో దాతల కోసం ప్రత్యేకంగా ఖాతా తెరిచారు. దాతలు రెండు లక్షల కంటే అధికంగా నిధులు ఇస్తే పాఠశాల యాజమాన్యం కమిటీ సభ్యుడిగా ..10 లక్షల విరాళం అంతకంటే ఎక్కువగా ఇస్తే స్కూల్‌లోని ఓ క్లాస్‌ రూమ్‌ గదికి దాత సూచించిన పేరు పెడతామని విద్యాశాఖ  మార్గదర్శకాలు వెల్లడించింది. పూర్వ విద్యార్థులతో కూడిన అల్యూమిని అసోసియేషన్‌కు పూర్వ విద్యార్థులు, దాతలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పలు సంస్థల నుంచి నిధులు సమీకరణ బాధ్యతలు అప్పగించింది.

  బడులకు పెట్టుబడి పెట్టేవారే లేరా..

  దాతల ద్వారా ఖాతాల్లో జమైన నిధులను ప్రభుత్వ పాఠశాల మౌళిక వసతులు కల్పన కోసం జిల్లా కలెక్టర్ అనుమతితో ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధులు ఖర్చు చేయకుండా అలాగే ఖాతాలో ఉంటే వాటి ద్వారా వచ్చే వడ్డీని పాఠశాల నిర్వాహణ కోసం వినియోగించవచ్చు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లో దాతల ఖాతాలో ఇప్పటికీ జమైన డబ్బు నామమాత్రమే. కేంద్రం పోర్టల్‌కు, సర్కారు స్కూళ్ల బలోపేతంలో సమాజ భాగ్యస్వామ్యాన్ని పెంచి లక్ష్యంతో కేంద్రం సైతం విద్యాంజలి పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. గుర్తింపు పొందిన పాఠశాలలో పోర్టల్‌లో నమోదు చేసుకుని బడి అవసరా లే మిటి కావాల్సిన నిధులు ఎన్ని ఇతర వివరాలను అందులో పొందుపరచాలి ఆ పోర్టల్ లోనే దాతగా నమోదు చేసుకున్న వాళ్లు తగిన సహకారం అందిస్తారు.

  Telangana : అక్కడ మంకీపాక్స్ కంటే అవే ఎక్కువ భయపెడుతున్నాయి .. గడప దాటాలంటే గజగజ వణుకుతున్నారు  సమర్ధించకుంటున్న అధికారులు..

  దాతలతో ప్రధానోపాధ్యాయులు అవగాహన ఒప్పందాలు కుదిరించుకొని పనులు చేపట్టవచ్చు. నిర్మాణ పనులు, విద్యుత్ ఉపకరణలు, ఫర్నిచర్, కంప్యూటర్లు, డిజిటల్ తరగతుల పరికరాలు, క్రీడా సామాగ్రి, నీటి శుద్ది కేంద్రాలు ఇలా పాఠశాలలో అవసరమైన వాటిని పోర్టల్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. అంతే కాదు విశ్రాంత ఉపాధ్యాయులు సైతం ప్రత్యేక తరగతులు చెప్పేందుకు వాలంటీర్లుగా అందులో నమోదు చేసుకోవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాఠశాలల పోర్టల్‌లో నమోదు చేసుకున్న దాతల సంఖ్య తక్కువే. ఇదే విషయాన్ని ఐదు జిల్లాల విద్యాధికారులతో చర్చిస్తే కొద్ది రోజుల్లో బడిబాట కార్యక్రమం వేగవంతం అవుతుందంటున్నారు. ఆ టైమ్‌లో పేరెంట్స్‌ స్కూల్‌ ఉపాధ్యాయులను కలిసేందుకు వచ్చిన సమయంలో స్కూల్ యాజమాన్య కమిటీ విరాళాలు సేకరిస్తారని చెబుతున్నారు. వస్తు, డబ్బురూపంలోనైనా మన ఊరు -మన బడికి సాయం చేయవచ్చని కోరుతున్నారు అధికారులు. అలుమిని కమిటీ ,పాఠశాల యజమాన్య కమిటీలు దాతలు స్పందించేలా కృషి చేస్తామని చెబుతున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mahabubnagar, Telangana News

  ఉత్తమ కథలు