Donkeys: ఆ జిల్లాలో రైతులను ఆదుకుంటున్న గాడిదలు.. ఎలాగంటే..

Donkeys: కర్ణాటక, మహారాష్ట్రల నుంచి గాడిదలతో వచ్చిన వలస కూలీలు రైతులకు ధాన్యం తరలించేందుకు సహాయ పడుతున్నారు. వర్షాలతో పంట పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేక ఆయోమ‌య పరిస్థితిలో ఉన్న రైతుల‌కు గాడిదలు ఉపయోగపడుతున్నాయి.

news18-telugu
Updated: October 19, 2020, 7:10 PM IST
Donkeys: ఆ జిల్లాలో రైతులను ఆదుకుంటున్న గాడిదలు.. ఎలాగంటే..
గాడిదలపై ధాన్యాన్ని తరలిస్తున్న వలస కూలీలు
  • Share this:
NZBఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దీంతో చేతికి వచ్చిన పంట ఇంకా పొలాల్లోనే ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఈ వర్షాల్లో ధాన్యాన్ని తరలించేందుకు పొలాల వద్దకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అక్కడి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో కర్ణాటక, మహారాష్ట్రల నుంచి గాడిదలతో వచ్చిన వలస కూలీలు రైతులకు ధాన్యం తరలించేందుకు సహాయ పడుతున్నారు. వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. ఆరుగాలం క‌ష్టించి పండించిన పంట‌లు కోసిన రైతులు ధాన్యాన్ని త‌ర‌లించేదుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే పంట పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేక ఆయోమ‌య స‌రిస్థితిలో ఉన్న రైతుల‌కు గాడిదలు స‌హాయ‌ప‌డుతున్నాయి.

పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక ప్రాంతంలోని బీదర్, ఔర‌ద్, మహారాష్ట్రలోని దెగ్లూర్, ముద్కేడ్, నార్సీ తదితర ప్రాంతాల నుంచి గాడిదలను తీసుకుని తెలంగాణకు వలస వస్తున్నారు. నెల రోజుల పాటు ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, నిజాంసాగర్, బాన్సువాడ తదితర ప్రాంతాలకు వీరు వలస వస్తున్నారు.. వలస వచ్చిన వారు గాడిదలపై ధాన్యాన్ని రవాణా చేసేందుకు డ‌బ్బుల‌ను కాకుండా రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని మాత్రమే తీసుకుంటారు. రైతు ఇంటికి లేదా ధాన్యం కొనుగోలు కేంద్రానికి 20 బస్తాల‌కు ఒక బ‌స్తా ధాన్యాన్ని రవాణా ఛార్జీల కింద తీసుకుంటారు. సుమారుగా ఒక గాడిద డెబ్బై నుంచి ఎనభై కిలోల బరువు గల ధాన్యాన్ని మోసుకొస్తున్నాయి.

‘ఈ సారి కురిసిన భారీ వర్షాలకు పంటలు సమృద్ధిగా పండాయి. పంట పొలాల‌కు ఎలాంటి వాహనాలు రాని స‌మ‌యంలో ఈ గాడిద‌లు మాకు చాలా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి’ అని రాజ‌న్న అనే రైతు తెలిపాడు. ‘మా ప్రాంతంలో ప‌నులు లేక ఖాళీగా ఉన్న స‌మ‌యంలో ఇక్క‌డ ప‌ని దొక‌డంతో ఇక్క‌డికి వ‌చ్చి జీవ‌నోపాధి పొందుతున్నాం’ వలస వచ్చిన ఓ వ్యక్తి చెప్పాడు. ‘మాకు గోధుమ, పత్తి, శనగలు పెసర్లు మినుములు పండుతాయి. కానీ వ‌రి పండ‌దు. అందువ‌ల్ల మాకు ఏడాదికి స‌రిప‌డా ధాన్యాన్ని సంపాధించుకుంటాం’ అని అన్నాడు.
Published by: Nikhil Kumar S
First published: October 19, 2020, 6:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading