Home /News /telangana /

DOMESTIC POWER CONSUMERS IN TELANGANA TO BE CHARGED BASED ON LAST YEAR MARCH BILL BS

Electricity Bill Payment : కరెంటు బిల్లుపై ప్రభుత్వం సంచలన ఆఫర్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది(2019) మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లునే ఈ నెలలో కట్టుకోవచ్చని వినియోగదారులకు తెలిపింది.

    లాక్‌డౌన్ ప్రభావంతో కరెంటు బిల్లు రీడింగ్ తీసేందుకు బిల్ కలెక్టర్లు రాలేని పరిస్థితి. దానికోసం తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది(2019) మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లునే ఈ నెలలో కట్టుకోవచ్చని వినియోగదారులకు తెలిపింది. ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల విషయానికి వస్తే గత ఏడాది మార్చిలో వచ్చిన బిల్లులో సగం మొత్తాన్ని కట్టాలని తెలిపింది. గత ఏడాది మార్చికి సంబంధించిన బిల్లుల వివరాలను విద్యుత్తు పంపిణీ సంస్థలు నేరుగా ఫోన్‌కు సందేశం పంపనున్నాయి. లాక్‌డౌన్ వల్ల మీటర్ రీడింగ్ తీసుకునే అవకాశం లేకపోవడంతో డిస్కంలకు ఈ వెసులుబాటు కల్పిస్తూ టీఎస్ఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ ముగిశాక మీటర్ రీడింగ్ తీసుకొని బిల్లు ఇస్తారు. ఒకవేళ ఎక్కువ బిల్లు చెల్లిస్తే సర్దుబాటు చేస్తారు. తక్కువ బిల్లు చెల్లిస్తే వచ్చే నెలలో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: CM KCR, Electricity bill, Telangana, Telangana News

    తదుపరి వార్తలు